నిజామాబాద్Women Reservation | మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడం సరికాదు..: బొబ్బిలి రామకృష్ణ

Women Reservation | మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడం సరికాదు..: బొబ్బిలి రామకృష్ణ

మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడాన్ని ఖండిస్తున్నామని కాంగ్రెస్ నిజామాబాద్​ నగరాధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Women Reservation |మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనతో (delimitation issue) ముడిపెట్టడాన్ని ఖండిస్తున్నామని కాంగ్రెస్ నిజామాబాద్​ నగరాధ్యక్షుడు (Nizamabad DCC) బొబ్బిలి రామకృష్ణ అన్నారు. లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

Women Reservation | బీజేపీది అసత్య ప్రచారం..

భారత జాతీయ కాంగ్రెస్ (Indian National Congress) మహిళా వ్యతిరేక పార్టీ అని.. పార్లమెంట్​లో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుందని బీజేపీ అసత్య, దురుద్దేశపూరిత ప్రచారం సాగిస్తోందని మండిపడ్డారు. ఇది దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో చేస్తున్న ప్రచారమన్నారు. వాస్తవానికి, మహిళా రిజర్వేషన్ బిల్లును (Women Reservation Bill) పార్లమెంట్​ 2023లోనే ఏకగ్రీవంగా ఆమోదించిందన్నారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో, దేశ వ్యాప్తంగా పార్లమెంట్​, రాష్ట్ర శాసన సభల స్థానాల సంఖ్యను పెంచడానికి, నియోజకవర్గాల పునర్విభజన (delimitation) చేపట్టడానికి చేసిన ప్రయత్నమే ‘రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు’ అని ఆయన స్పష్టం చేశారు.

Women Reservation | రిజర్వేషన్లతో పునర్విభజనను ముడిపెట్టొద్దు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్లమెంట్​, శాసన సభల్లో ఉన్న స్థానాల సంఖ్య ఆధారంగానే, మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్ గట్టిగా డిమాండ్ చేస్తోందని బొబ్బిలి రామకృష్ణ అన్నారు. మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టడానికి, వాస్తవాలను ప్రజల ముందు ఉంచడానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. కార్యక్రమంలో నగర కార్పొరేషన్ డీసీసీ కార్యదర్శులు ఉప్పరి స్వప్న, మడుపు స్వప్న, మాజీ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగడం సుమన్, మాజీ కార్పొరేటర్ మురళి, జెండా గుడి ఛైర్మన్​ లవంగ ప్రమోద్, హమాల్వాడి సంతోషి మాత, సాయిబాబా గుడి ఛైర్మన్ గంగాకిషన్, ఎన్​ఎస్​యూఐ నాయకులు అష్రఫ్ తదితరులు పాల్గొన్నారు.

bobbili

 ఇది కూడా చదవండి: Kalvakuntla Kavitha | ఆదివాసీల హక్కులను హరిస్తున్న కేంద్రం : కల్వకుంట్ల కవిత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....