నిజామాబాద్TGSRTC OPRS Services | ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ

TGSRTC OPRS Services | ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ

ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్​ఆర్టీసీ విస్తృతంగా ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోందని రీజినల్​ మేనేజర్ టీ జోత్స్న తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: TGSRTC OPRS Services | ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్​ఆర్టీసీ (TGSRTC) నిజామాబాద్​ రీజియన్​(nizamabad rtc) నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోందని రీజినల్​ మేనేజర్ టీ జోత్స్న తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.

TGSRTC OPRS Services | ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని..

ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ పరిధిలోని డిపోల నుండి ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేస్తూ.. ఓపీఆర్​ఎస్ ​(ఆన్​లైన్​ ప్యాసింజర్​ రిజర్వేషన్​ సిస్టం)ను (OPRS) అమలు చేస్తున్నట్లు ఆర్​ఎం తెలిపారు. రాష్ట్రంలోని ముఖ్య పట్టణాలు, హైదరాబాద్ జేబీఎస్, ఎంజీబీఎస్, ఎయిర్​పోర్ట్​, తిరుపతి, విజయవాడ, భద్రాచలం తదితర ప్రాంతాలకు మొత్తం 82 ఓపీఆర్​ఎస్ ప్రత్యేక సర్వీసులను నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.

ప్రయాణికుల అవసరాలను బట్టి రాజధాని, సూపర్ లగ్జరీ, ఈ సూపర్ లగ్జరీ(E Super Luxury), లహరి ఏసీ, లహరి(Lahari) నాన్-ఏసీ వంటి బస్సు సేవలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్, శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​, జేబీఎస్, ఎంజీబీఎస్​కు అధిక సంఖ్యలో సర్వీసులు నడుపుతున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులు ఆర్టీసీ వెబ్​సైట్​ (www.tgsrtcbus.in), MEE TICKET అనే మొబైల్ యాప్​లో టికెట్​ బుక్​ చేసుకోవచ్చని సూచించారు.

ఇది కూడా చదవండి: Bajaj Group Centenary | బజాజ్ గ్రూప్ శతాబ్ది ఉత్సవాలు.. దేశాభివృద్ధిలో వందేళ్ల నమ్మకమైన ప్రస్థానం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Gangadhara Sub Registrar | ఏసీబీ వలలో గంగాధర ఇన్​ఛార్జి సబ్ రిజిస్ట్రార్.. రూ. 1.06 లక్షల అక్రమ వసూళ్ల కేసులో అరెస్టు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gangadhara Sub Registrar | పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్...

T-SAT Education Department | ఇక విద్యాశాఖ పరిధిలోకి టీ-శాట్.. ఐటీ శాఖ నుంచి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: T-SAT Education Department | తెలంగాణ ప్రభుత్వ డిజిటల్...

లక్డీకాపూల్ గ్లెనీగిల్స్ హాస్పిటల్స్‌లో అత్యాధునిక లేబర్ సూట్ ప్రారంభం

హైదరాబాద్: లక్డీకాపూల్‌లోని గ్లెనీగిల్స్ హాస్పిటల్స్ (ఫోర్టిస్ నెట్‌వర్క్ హాస్పిటల్) మహిళల ఆరోగ్య...

Bandi Sanjay Statement | నా కొడుకు తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే : బండి సంజయ్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Sanjay Statement | కేంద్ర మంత్రి...