అక్షరటుడే, వెబ్‌డెస్క్: May 13 Gold Prices | అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, డాలర్ Dollar మార్పిడి విలువల్లో హెచ్చుతగ్గుల ప్రభావంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు మళ్లీ పెరగడం మొదలు పెట్టాయి. ఈ వారంలోనే పసిడి ధరలు దాదాపు రూ.1,550 వరకు పెరగడం గమనార్హం.
అయితే ధరలు పెరుగుతున్నప్పటికీ, ఈ పెరుగుదల భారీ స్థాయిలో కాకుండా మోస్తరు స్థాయిలోనే కొనసాగవచ్చని బులియన్ మార్కెట్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, మే 13 ఉదయం 6.30 గంటల సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,999గా నమోదైంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,41,160 వద్ద కొనసాగుతోంది.
May 13 Gold Prices | క్రమంగా పైపైకి..
మరోవైపు వెండి ధరలు Silver Rates భారీగా ఎగబాకాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.3 లక్షల మార్కును చేరుకోవడం మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా చూస్తే చెన్నైలో బంగారం ధరలు అత్యధికంగా నమోదయ్యాయి. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,56,340కు చేరింది.
ఢిల్లీలో అదే పరిమాణం బంగారం రూ.1,54,140 వద్ద ఉండగా, ముంబైలో రూ.1,53,990గా ట్రేడవుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర చెన్నైలో రూ.1,43,310గా నమోదైంది. ఢిల్లీలో రూ.1,41,310 కాగా, ముంబైలో రూ.1,41,160 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరల్లో కూడా దేశవ్యాప్తంగా భారీ పెరుగుదల కనిపిస్తోంది. ముఖ్యంగా చెన్నైలో Chennai కిలో వెండి ధర రూ.3 లక్షల మార్కును తాకగా, ఇతర ప్రధాన నగరాల్లో కూడా ఇదే స్థాయికి చేరువగా ట్రేడవుతోంది. పరిశ్రమల అవసరాలు, అంతర్జాతీయ డిమాండ్ పెరగడం, పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గుచూపడం వంటి అంశాలు వెండి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అనిశ్చితి, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక మందగమనం భయాలు వంటి కారణాలతో ఇన్వెస్టర్లు మళ్లీ బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో కూడా బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు కొనసాగవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

