Paddy Transport Inspections | లారీలను కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Paddy Transport Inspections | జిల్లావ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ(Civil Supplies Department) ఆధ్వర్యంలో యాసంగి సీజన్​లో ధాన్యం సేకరణను వేగవంతం చేశారు.  ఈ మేరకు మంగళవారం కలెక్టర్​ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi) సైతం సంబంధిత శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. లారీలను సమకూర్చుకుని త్వరితగతిన ధాన్యాన్ని రైస్​మిల్లులకు తరలించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో లారీల తనిఖీలు చేపట్టారు.

Paddy Transport Inspections | డీటీసీ ఆధ్వర్యంలో తనిఖీలు..

మాధవనగర్​(Madhava nagar) ఆర్​వోబీ ప్రాంతంలో డిప్యూటీ ట్రాన్స్​పోర్ట్​ కమిషనర్​ దుర్గాప్రమీల(DTC Durga Pramila) నేతృత్వంలో బుధవారం ఉదయం ఎంవీఐ కిరణ్​, ఇతర అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఖాళీగా వెళ్తున్న లారీలను ఆపి కొనుగోలు కేంద్రాలకు తరలించారు. ఖాళీగా ఉన్న లారీలు అధికారుల సూచనల మేరకు తప్పనిసరిగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సేవలందించాలని సూచించారు. లేని పరిస్థితిలో కలెక్టర్​ సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని డీటీసీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ సీజన్​లో 86 లారీలను ప్యాడీ సెంటర్లకు తరలించినట్లు తెలియజేశారు.

Paddy Transport Inspections | జిల్లావ్యాప్తంగా ఆరు మొబైల్​ టీంలు..

ఖాళీగా ఉన్న లారీలను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు ఆరు మొబైల్​ టీంలను సివిల్​ సప్లై శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారని డీటీసీ తెలిపారు. అందులో రవాణా శాఖ అధికారులు సైతం ఉన్నారన్నారు. మాధవనగర్​ వంతెన వద్ద, జగిత్యాల (Jagtial) వైపు వెళ్లే మార్గంలో, అంకాపూర్​ వద్ద, బాల్కొండ జాతీయ రహదారిపై, నందిపేట్​ సమీపంలో, మరో మొబైల్​ టీం పనిచేస్తున్నాయన్నారు.

dtc

ఇది కూడా చదవండి: Nagarjuna T Shirts | నాగార్జున ఫోటోలతో టీ-షర్టుల విక్రయం.. ఢిల్లీ హైకోర్టు సీరియస్!

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *