Hyderabad Nepali Gang | హైదరాబాద్‌లో మరో నేపాలీ గ్యాంగ్ భారీ దోపిడీ

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Nepali Gang | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో నేపాలీ గ్యాంగ్​ల దోపిడీలు ఆగడం లేదు. ఇటీవల రిటైర్డ్​ ఐపీఎస్​ భార్యను హత్య చేసి దోపీడీ చేసిన విషయం మరువక ముందే మరో ఘటన వెలుగు చూసింది.

జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ (Jawahar Nagar Police Station) పరిధిలోని గల్ఫ్ ఎంక్లేవ్‌లో నివాసం ఉండే డా. విజయలక్ష్మి, మురళీమోహన్ దంపతులకు మత్తు మందు ఇచ్చి, కాళ్లు చేతులు కట్టేసి నేపాలి ముఠా దోపిడీకి పాల్పడింది. 60 తులాల బంగారం, రూ. 30 వేలు దొంగలించినట్లు బాధితులు తెలిఆరు. 13 రోజుల క్రితం పనిలో చేరిన ఇద్దరు నేపాలీలతో పాటు మరో ఐదుగురు కలిసి ఈ దోపిడీకి పాల్పడినట్లు సమాచారం.

Hyderabad Nepali Gang | బర్త్​ డే అని చెప్పి..

ప్రొఫెసర్​ మరళీధర్​ మోహన్​, డాక్టర్​ విజయలక్ష్మి దంపతులు కౌకుర్ గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్నారు. వీరి వద్ద 13 రోజుల క్రితం ఓ జంట పనికి కుదిరింది. ఇటీవల మరో మహిళ వచ్చి వారి బంధువుగా పరిచయం చేసుకొని అదే ఇంట్లో ఉంటుంది. సోమవారం రాత్రి నేపాలీ మహిళ జన్మదిన వేడుకలు చేసుకుంటామని ఇంటి యజమానిని అడిగారు. దీంతో వారు సరే అన్నారు. ఈ వేడుకలకు బటయ నుంచి మరో ముగ్గురు వ్యక్తులు వచ్చారు. వేడుకల అనంతరం భోజనం చేస్తుండగా ప్రొఫెసర్​ దంపతులపై నేపాల్ గ్యాంగ్​ దాడి చేసింది. అనంతరం కాళ్లు, చేతులు కట్టేసి ఇంట్లోని నగదు తీసుకొని పారిపోయారు. ఇంట్లోని సీసీ టీవీ కెమెరాలను ధ్వంసం చేసి.. అన్ని గేట్లకు తాళాలు వేసి నిందితులు పరారు అయ్యారని బాధితులు తెలిపారు.

Hyderabad Nepali Gang | కేకలు వేయడంతో..

నిందితులు వారికి మత్తు మందు ఇచ్చి దోపిడీకి పాల్పడ్డారు. మంగళవారం మధ్యాహ్నం మత్తు నుంచి తేరుకున్న వారు గట్టిగా అరవడంతో స్థానికులు తలుపులు తీశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad Nepali Gang | పక్కా స్కెచ్​ ప్రకారం..

నేపాలీ గ్యాంగ్​లు (Nepali Gangs) హైదరాబాద్ నగరంలో ప్రమాదకరంగా మారాయి. మొదట దంపతులు పని పేరిట ఇళ్లలో చేరుతారు. వీరు ఎక్కువగా దంపతులు మాత్రమే ఉంటున్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటారు. పిల్లలు ఇతర ప్రాంతాల్లో ఉండి, ఒంటరిగా ఉంటున్న ధనవంతులైన వృద్ధ దంపతుల ఇళ్లలో పనికి చేరుతారు. మొదట మంచిగా పని చేసి యజమానులకు నమ్మకం కల్పిస్తారు. అనంతరం దోపిడీకి స్కెచ్​ వేస్తారు. ఇంట్లో ఎక్కడ నగలు, బంగారం ఉన్నాయో తెలుసుకుంటారు. తర్వాత తమ గ్యాంగ్​లోని ఇతర సభ్యులతో కలిసి దోపిడీ చేస్తారు. ఇంటి యజమానులకు మత్తు మందు ఇచ్చి, కట్టేసి నగలు, నగదు, ఇతర వస్తువులతో పరారు అవుతారు. ఇప్పటివరకు హైదరాబాద్​లో ఇలాంటి ఘటనలు నాలుగు చోటు చేసుకున్నాయి.

Hyderabad Nepali Gang | మరిన్ని ఘటనలు జరిగే అవకాశం

ఇటీవల రిటైర్డ్​ ఐపీఎస్​ అధికారి వినయ్​ రంజన్​ రే భార్య తనూజను నేపాల్​ గ్యాంగ్ హత్య చేసిన విషయం తెలిసిందే. ఆమెను హత్య చేసి ఇంట్లోని నగలు, నగదుతో నిందితులు పారిపోయారు. దీంతో పోలీసులు ఈ కేసును సవాల్​గా తీసుకున్నారు. అలాగే నేపాల్ పని మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే పలువురు నేపాలీగ్యాంగ్​కు చెందిన వారు ఇళ్లలో పని చేస్తున్నారు. దీంతో వారు పోలీసుల కంట పడకుండా తిరిగి తమ దేశం వెళ్లే అవకాశం ఉంది. దీంతో ఆయా ఇళ్లలో అందిన కాడికి దండుకుని పారిపోయే ఛాన్స్​ ఉంది. ఈ నేపథ్యంలో నేపాలీలను పనిలో పెట్టుకున్న వారు అప్రమత్తంగా ఉండాలి.

ఇది కూడా చదవండి..: లక్డీకాపూల్ గ్లెనీగిల్స్ హాస్పిటల్స్‌లో అత్యాధునిక లేబర్ సూట్ ప్రారంభం

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *