జాతీయంUAE Indian Billionaires | యూఏఈ బిలియనీర్లలో మనోళ్ల అధికం.. 17 మందిలో 9 మంది...

UAE Indian Billionaires | యూఏఈ బిలియనీర్లలో మనోళ్ల అధికం.. 17 మందిలో 9 మంది భారతీయులే!

యూఏఈలో నివసిస్తున్న అరబేతర బిలియనీర్లలో భారతీయులే ఎక్కువగా ఉన్నారు. మొత్తం 17 మందిలో మనోళ్లే తొమ్మిది మంది కావడం గమనార్హం.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : UAE Indian Billionaires | 2026లో యూఏఈలోని అత్యంత సంపన్న(బిలియనీర్) నివాసితుల జాబితాలో తొమ్మిది మంది భారతీయులు చోటు దక్కించుకున్నారు. వీరి సంయుక్త సంపద 49.9 బిలియన్ డాలర్లుగా ఉంది. ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ (Forbes Middle East) తాజాగా విడుదల చేసిన జాబితా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

UAE Indian Billionaires | స్వర్గధామంగా యూఏఈ ఓ

ఈ జాబితాలో ఐదు దేశాలకు చెందిన 17 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరందరి సంపద విలువ 212.6 బిలియన్ డాలర్లు కావడం గమనార్హం. సంపన్న పారిశ్రామికవేత్తలు, ప్రపంచ వ్యాపార నాయకులకు యూఏఈ ఓ స్వర్గధామంగా నిలుస్తోందని ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ పేర్కొంది. రిటైల్, రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్, హెల్త్‌కేర్ వంటి రంగాలలో సేవలందిస్తూ తాము ఎదుగుతూ, యూఏఈ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ భారతీయ వ్యాపారవేత్తలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ జాబితాలోని వారి వివరాలు తెలుసుకుందామా..

UAE Indian Billionaires | అత్యంత సంపన్నుల జాబితాలో తొమ్మిది మంది భారతీయులు

వినోద్ అదాని : 20.8 బిలియన్ డాలర్ల సంపదతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. అదానీ గ్రూప్‌నకు సంబంధించిన ఓవర్సీస్ ఇన్వెస్ట్‌మెంట్ల ద్వారా ఆయన సంపద పెరిగింది.
ఎంఏ యూసఫ్ అలీ : లూలూ గ్రూప్ ఇంటర్నేషనల్ అధినేత. ఈయన సంపద 5.8 బిలియన్ డాలర్లుగా ఉంది.
రేణుక జగతియాని : లాండ్‌మార్క్ గ్రూప్ చైర్‌పర్సన్ అయిన ఈమె సంపద విలువ 5.6 బిలియన్ డాలర్లు.

రవి పిళ్లై : ఆర్పీ గ్రూప్ వ్యవస్థాపకుడు. ఈయన నికర సంపద 4.2 బిలియన్ డాలర్లు.
సన్నీ వర్కీ : జెమ్స్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకుడు. ఈయన సంపద 4 బిలియన్ డాలర్లుగా ఉంది.
పీఎన్సీ మీనన్ : శోభా గ్రూప్ వ్యవస్థాపకుడు. ఈయన సంపద 3.9 బిలియన్ డాలర్లు.
కబీర్ ముల్చందాని : రియల్ ఎస్టేట్ దిగ్గజం, ఫైవ్ ీVAల్డింగ్స్ వ్యవస్థాపకుడైన ఈయన సంపద సుమారు 2.2 బిలియన్ డాలర్లు.
షంషీర్ వయలిల్ : బుర్జీల్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు. ఈయన సంపద 1.8 బిలియన్ డాలర్లుగా అంచనా.
ధృవ్ సాహ్నీ : త్రివేణి ఇంజినీరింగ్ , ఇండస్ట్రీస్ అధినేత అయిన ఈయన సంపద విలువ 1.6 బిలియన్ డాలర్లని అంచనా.

ఇది కూడా చదవండి..: Telangana Irrigation Projects| నీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి: కవిత

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

CBSE 12th Results| సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల

అక్షరటుడే వెబ్‌డెస్క్:CBSE 12th Results|దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న సెంట్రల్...

Jogipet Diesel Theft| జోగిపేటలో చెడ్డి గ్యాంగ్ కలకలం.. బస్సులు, లారీలే లక్ష్యంగా డీజిల్ చోరీ

అక్షరటుడే వెబ్‌డెస్క్:Jogipet Diesel Theft|సంగారెడ్డి జిల్లా జోగిపేటలో అర్ధరాత్రి వేళ దొంగలు...

Gold Price Hike | సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న పసిడి..ఒకేరోజు రూ.వేలల్లో పెరుగుదల

అక్షరటుడే, కామారెడ్డి: Gold Price Hike | పసిడి కొనాలనుకునే వారికి...

Kavitha Demands Lookout Notice| బండి భగీరథ్​పై లుకౌట్ నోటీసులు ఇవ్వాల్సిందే: కవిత

అక్షరటుడే వెబం‌డెస్క్: Kavitha Demands Lookout Notice | కేంద్ర మంత్రి...