అక్షరటుడే, కామారెడ్డి: Mobile Phone Recovery | మొబైల్ ఫోన్ పోయిందని కంగారు పడొద్దని, సీఈఐఆర్ పోర్టల్(ceir portal) ద్వారా ఫోన్‌ను తప్పకుండా రికవరీ చేయవచ్చని ఎస్పీ రాజేష్ చంద్ర(sp rajesh chandra) భరోసా ఇచ్చారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఫోన్లు రికవరీ చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
Mobile Phone Recovery | 30రోజుల్లో 115 ఫోన్ల ట్రేస్ చేశాం..
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గడిచిన 30 రోజుల్లో ఇన్‌స్పెక్టర్ సంపత్ పర్యవేక్షణలో ఆర్ఎస్సై బాలరాజు, ఐదుగురు కానిస్టేబుళ్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం సాంకేతిక పరిజ్ఞానంతో 115 ఫోన్లను ట్రేస్ చేసిందన్నారు. ఈ ప్రత్యేక బృందం ప్రతి నెలా సగటున 100కు పైగా ఫోన్లను రికవర్ చేస్తూ బాధితుల్లో నమ్మకం పెంచుతోందన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.79 లక్షల విలువైన 499 ఫోన్లు రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. గత ఏడాది రూ.3 కోట్ల విలువైన 1,834 ఫోన్లు బాధితులకు అప్పగించడం జరిగిందన్నారు.
Mobile Phone Recovery | సీఈఐఆర్ పోర్టల్ ద్వారా..
సీఈఐఆర్ పోర్టల్ వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు జిల్లాలో రూ.7.64 కోట్ల విలువైన 4,780 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించామని పేర్కొన్నారు. ఫోన్ పోతే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, సిమ్ కార్డును బ్లాక్ చేయించాలని సూచించారు. http://www.ceir.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫోన్ ఐఎంఈఐ నంబర్‌ను బ్లాక్ చేయాలన్నారు. గుర్తు తెలియని లింకులు, కాల్స్‌కు స్పందించొద్దని, సైబర్ మోసాలు(cyber safety) జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఫోన్‌లో బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత ఫోటోలు, కీలక డేటా ఉంటాయనో, అందుకే ఫోన్ పోగానే అప్రమత్తంగా ఉండాలని, పోలీస్ శాఖ అండగా ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. మొబైల్ రికవరీలో ప్రతిభ చూపిన ప్రత్యేక బృందాన్ని ఎస్పీ అభినందించారు.
ఇది కూడా చదవండి : Bandi Bhagirath Case|బండి భగీరథ్ అరెస్ట్ ఖాయం.. విదేశాలకు వెళ్లినా రప్పిస్తాం: టీపీసీసీ చీఫ్ మహేష్

