Heat Stroke Awareness | వడదెబ్బకు గురికాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలి: డీఎంహెచ్​వో

shashi kiran Mottala

అక్షరటుడే, మెండోరా: Heat Stroke Awareness | వడదెబ్బకు గురికాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి డీఎంహెచ్​వో రాజశ్రీ (DMHO Rajashree) సూచించారు. పోచంపాడ్ ​(Pochampad) ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు.

Heat Stroke Awareness | మందుల నిల్వలు, లాబరేటరీ పరిశీలన..

ఈ సందర్భంగా డీఎంహెచ్​వో పీహెచ్​సీలోని లాబరేటరీ, మందుల నిల్వ గదులను క్షుణంగా పరిశీలించారు. అనంతరం ఆరోగ్య కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలకు సంబంధించిన రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఎండాకాలంలో సంభవించే వడదెబ్బపై మండలంలోని (Mendora) గ్రామాల్లో ఆశా కార్యకర్తల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. 14 ఏళ్ల బాలికలు హెచ్​పీవీ వ్యాక్సిన్ (HPV Vaccine) తీసుకునేలా విస్తృత ప్రచారం చేయాలని ఆమె వైద్యాధికారి మద్దుల రాజేష్​ను ఆదేశించారు.

ఇది కూడా చదవండి: Bandi Bhagirath Case|బండి భగీరథ్ అరెస్ట్ ఖాయం.. విదేశాలకు వెళ్లినా రప్పిస్తాం: టీపీసీసీ చీఫ్ మహేష్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *