నిజామాబాద్Government School Education | ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య: డీఈవో అశోక్​

Government School Education | ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య: డీఈవో అశోక్​

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని నిజామాబాద్​ డీఈవో అశోక్ అన్నారు. నగరంలోని బోర్గాం(పి) ఉన్నత పాఠశాలలో విద్యా వారోత్సవాల్లో సందర్భంగా నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో మాట్లాడారు.

అక్షరటుడే, ఇందూరు: Government School Education | ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య (government school education) అందుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ (DEO Ashok) అన్నారు. నగరంలోని బోర్గాం(పి) ఉన్నత పాఠశాలలో (Borgam (P)ZPHS) విద్యా వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Government School Education | సర్కారు స్కూళ్లలో అన్ని సౌకర్యాలు..

ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరారు. నాణ్యమైన చదువు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం (Mid-Day Meals), పుస్తకాలు, దుస్తులు ఇలా అన్ని సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నాయన్నారు. అనంతరం మండల స్పెషల్ ఆఫీసర్ తిరుమల ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పర్చుకుని వాటి సాధనకు ముందుకు కదలాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సైతం విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను ప్రోత్సహించాలన్నారు.

borg

Government School Education | పాఠశాలకు పూర్తి సహకారం..

కార్పొరేటర్ యాదాల నరేష్ మాట్లాడుతూ బోర్గాం(పి) ఉన్నత పాఠశాలకు జిల్లాలోనే (Nizamabad) మంచి పేరు ఉందన్నారు. ఇక్కడ వెయ్యిమందికి పైగా విద్యార్థులు చదువుకోవడం గొప్ప విషయమన్నారు. పాఠశాలకు అన్నివేళలా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. పాఠశాలలో విద్యార్థుల నమోదు, విద్యాస్థితి, వివిధ అంశాల్లో పాఠశాల చేపట్టిన కార్యక్రమాలను ఆడియో, వీడియో రూపంలో హెచ్​ఎం శంకర్ తల్లిదండ్రులకు వివరించారు. పాఠశాలలో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్​లో (Food Festival) వివిధ రకాల వంటకాలను ప్రదర్శించారు. అనంతరం ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కో–ఆప్షన్ మెంబర్ అశోక్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు జమున, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

schi1

scool

ఇది కూడా చదవండి: Stock Market Rally | వాల్యూ బయ్యింగ్.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Illegal Sand Transport | ఇసుక అక్రమ రవాణాపై పోలీసుల కఠిన చర్యలు.. మూడు ట్రాక్టర్ల సీజ్​..

అక్షరటుడే, భీమ్​గల్: Illegal Sand Transport | ఇసుక అక్రమ రవాణాపై...

Khushbu | “నడకే జిమ్‌”… 32 కేజీలు తగ్గి ఆశ్చర్యపరిచిన నటి ఖుష్బూ ఫిట్‌నెస్ ప్రయాణం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khushbu | ఒకప్పుడు దక్షిణాది సినీ ప్రేక్షకుల గుండెల్లో...

Lingampet Police | నాటు తుపాకీతో కాల్చుకుని యువకుడి బలవన్మరణం

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Lingampet Police | నాటుతుపాకీతో కాల్చుకుని ఓ యువకుడి...

Modi Lavrov Meeting | ప్రధాని మోదీతో రష్యా విదేశాంగ మంత్రి భేటీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi Lavrov Meeting | రష్యా విదేశాంగ...