జాతీయంFuel Price Hike | ప్రజలు ముందుకు సాగాలంటే సైకిలే మార్గం : అఖిలేష్​ యాదవ్

Fuel Price Hike | ప్రజలు ముందుకు సాగాలంటే సైకిలే మార్గం : అఖిలేష్​ యాదవ్

పెట్రోలు ధరల పెంపుపై సమాజ్​వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సెటైరికల్ ట్వీట్ చేశారు. ప్రజలు ముందుకు సాగాలంటే సైకిలే మార్గం అంటూ పోస్ట్ చేశారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fuel Price Hike | పెట్రోలు ధరల పెంపుపై సమాజ్​వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) సెటైరికల్ ట్వీట్ చేశారు. ప్రజలు ముందుకు సాగాలంటే సైకిలే మార్గం అంటూ పోస్ట్ చేశారు. సైకిల్ కన్నా ఉత్తమమైనది ఏదీ లేదని ముందే చెప్పామని పేర్కొన్నారు. కాగా యూపీలో ఎస్పీ గుర్తు సైకిల్ కావడం గమనార్హం.

కేంద్ర ప్రభుత్వం (Central Government) శుక్రవారం ఉదయం పెట్రోల్​, డీజిల్, సీఎన్​జీ ధరలను పెంచిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం నుంచి పెరిగిన ధరలు అమలులోకి వచ్చాయి. లీటర్​కు రూ.3 మేర ధరలు పెరిగాయి. ధరల పెరుగుదలపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికలు అయిపోగానే కేంద్రం ప్రజలపై భారం మోపడం మొదలు పెట్టిందని విమర్శిస్తున్నాయి. ఇంధన రేట్ల పెరుగుదలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు.

Fuel Price Hike | రానున్నది కష్టకాలం

దేశంలో ప్రస్తుతం ద్రవ్యోల్బణం పెరుగుతోంది. పాల ధరల నుంచి మొదలు పెడితే అనేక పదార్థాల ధరలు పెరిగాయి. వంట నూనె, పప్పులు, కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఇంధన ధరలు పెరగడంతో ఆ ప్రభావం ప్రజలపై పడనుంది. సరుకు రవాణా వ్యయం పెరగనుండటంతో కంపెనీలు వస్తువుల రేట్లు పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలపై అదనపు భారం పడనుంది. మరోవైపు ఈ ఏడాది వర్షాలు అంతంత మాత్రంగానే కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎల్​నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడుతాయని పేర్కొన్నారు. దీంతో రానున్న రోజుల్లో ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. ప్రభుత్వాలు స్పందించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: NEET Online Exam | వచ్చే ఏడాది నుంచి ఆన్​లైన్​లో ‘నీట్’ పరీక్ష

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Negligent Driving Accident | నిర్లక్ష్యపు కారు డ్రైవింగ్​కు నిండు ప్రాణం బలి..

అక్షరటుడే,కోటగిరి: Negligent Driving Accident | డివైడర్​ను కారు ఢీకొనగా ఓ...

UAE LPG Deal | ఎల్​పీజీ సరఫరాపై యూఏఈతో భారత్​ కీలక ఒప్పందం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : UAE LPG Deal | ఎల్​పీజీ సరఫరాపై...

Honda NX500 | ఇక క్లచ్‌తో పనిలేకుండా గేర్లు మార్చుకోవచ్చు.. అడ్వెంచర్ బైక్ ను విడుదల చేసిన హోండా

అక్షరటుడే, వెబ్​డెస్క్: Honda NX500 | హోండా మోటార్‌సైకిల్ (Honda Motorcycle),...

DRO Geetha Felicitation | జిల్లా అభివృద్ధికి కలిసికట్టుగా ముందుకెళ్దాం..: డీఆర్​వో గీత

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: DRO Geetha Felicitation | జిల్లా అభివృద్ధికి...