అక్షరటుడే, వెబ్‌డెస్క్ : UAE LPG Deal | ఎల్‌పీజీ సరఫరాపై భారత్ యూఏఈతో కీలక ఒప్పందం చేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) శుక్రవారం యూఏఈ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ ఆయన అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్‌తో భేటీ అయ్యారు.
ఈ పర్యటనలో ప్రధాని యూఏఈతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. LPG సరఫరాలపై యూఏఈతో భారత్ కీలక ఒప్పందం చేసుకుంది. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్‌లపై ఎంవోయూ కుదుర్చుకుంది. వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యంపైనా, నౌకల మరమ్మతు కేంద్రం ఏర్పాటుపై యూఏఈతో ఒప్పందం చేసుకుంది. భారత ఇంధన భద్రతకు ఊతమిచ్చేలా అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.
UAE LPG Deal | మరింత బలోపేతం
యూఏఈ పర్యటనపై ఎక్స్‌లో మోదీ స్పందించారు. ఈ సంక్షిప్తమైన అత్యంత ఫలవంతమైన పర్యటనను ముగిస్తున్నాను. భారత్-యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై నా సోదరుడు, షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో విస్తృతంగా చర్చలు జరిపాను. ఈ పర్యటన ఫలితాలు మన స్నేహాన్ని మరింత బలోపేతం చేసి, అభివృద్ధి మరియు శ్రేయస్సుకు దోహదపడతాయని నేను విశ్వసిస్తున్నాను అని మోదీ పేర్కొన్నారు. అనంతరం ఆయన పర్యటన ముగించుకొని నెదర్లాండ్ బయలు దేరారు.
UAE LPG Deal | భారత్‌లో పెట్టుబడులు
వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలకు సంబంధించిన అవగాహన ఒప్పందంతో పాటు, ఎల్‌పీజీ సరఫరా (LPG Supply)లకు సంబంధించిన ఒప్పందంపై కూడా ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. భారత మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో పాటు ఆర్‌బీఎల్ బ్యాంక్, సమ్మాన్ క్యాపిటల్‌లో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ప్రకటించారు.
ఇది కూడా చదవండి..: Modi Foreign Tour | ఐదు దేశాల పర్యటనకు బయలు దేరిన మోదీ.. కీలక అంశాలపై చర్చించనున్న ప్రధాని


