తెలంగాణHigh Speed Train | హైస్పీడ్​ రైలు కారిడార్​పై సీఎస్​ సమీక్ష

High Speed Train | హైస్పీడ్​ రైలు కారిడార్​పై సీఎస్​ సమీక్ష

హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులతో సమీక్షించారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Speed Train | హైదరాబాద్ (Hyderabad) కేంద్రంగా ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (CS Ramakrishna Rao) శుక్రవారం సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖ భాగస్వామ్యంతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

హైదరాబాద్ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరు (Bangalore) ప్రధాన నగరాలకు అనుసంధానించే హై స్పీడ్ రైల్ ప్రాజెక్టుతో తెలంగాణ రైజింగ్ 2047 ఎకనామిక్ గ్రోత్ కారిడార్​గా అభివృద్ధి చెందుతుందని సీఎస్​ తెలిపారు. ప్రజల భవిష్యత్ అవసరాలకు, పారిశ్రామిక, ఐటీ, పర్యాటక రంగాలలో అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ ఉపకరిస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్​–పూణే– ముంబయి హై స్పీడ్ రైలు మార్గానికి సంబంధించి డీపీఆర్​ సిద్ధం అయిందని రైల్వే అధికారులు ఆయనకు వివరించారు.

High Speed Train | భూ సేకరణ

హైదరాబాద్​–ముంబయి మార్గం 671 కి.మీ. ఉండగా.. రాష్ట్రంలో 93 కి.మీ. మేర భూ సేకరణ అవసరం ఉంటుందని అధికారులు వివరించారు. అలాగే హైదరాబాద్ – బెంగళూరు కారిడార్, హైదరాబాద్ – చెన్నై కారిడార్​లో 123 కి.మీ. మేర భూసేకరణ అవసరమని, కోకాపేట, శంషాబాద్ ప్రాంతాలలో రైల్వే డిపోలకు కొంత భూసేకరణ చేయాలని తెలిపారు. ఈ మేరకు రైల్వే శాఖతో సమన్వయం చేసుకోవాలని రోడ్లు, భవనాల శాఖ, హెచ్ఎండీఏ, జీఎంఆర్ ఎయిర్ పోర్టు అధికారులను సీఎస్​ ఆదేశించారు.

దీనిని కూడా చదవండి : Kavitha Comments KCR|కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక మరమనిషిలా మారారు : కవిత

 

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Supreme Court | సుప్రీంకోర్టు పొదుపు చర్యలు.. వారానికి రెండు రోజులు వర్చువల్ హియరింగ్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Supreme Court | సుప్రీంకోర్టు పొదుపు చర్యలు...

Smita Sabharwal IAS | ప్రజల అధికారి ‘స్మితా సభర్వాల్’.. అంకితభావానికి నిలువెత్తు రూపం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Smita Sabharwal IAS | పాలనలో తనకంటూ ఒక ప్రత్యేక...

Government Hospital Services | ప్రభుత్వ ఆస్పత్రుల సేవలను వినియోగించుకోవాలి..: ఎమ్మెల్యే ధన్​పాల్​

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Government Hospital Services | ప్రభుత్వ ఆస్పత్రిలో...