Nizamabad Paddy Procurement | రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ.. రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిజామాబాద్​

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Paddy Procurement | యాసంగి-2026 సీజన్​కు సంబంధించి వరిధాన్యం సేకరణలో నిజామాబాద్(Nizamabad) జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి (collector ila tripathi) తెలిపారు. శుక్రవారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు.

Nizamabad Paddy Procurement | 5.68 లక్షల మెట్రిక్​ టన్నులకు పైగా..

జిల్లాలో ఇప్పటికే 5.68 లక్షల మెట్రిక్ టన్నుల పైచిలుకు వరిధాన్యం సేకరణ పూర్తి చేశామని కలెక్టర్​ వివరించారు. కేవలం ఐదు శాతం మేరకు మిగిలి ఉన్న మరో 32,797 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సైతం వారం రోజుల్లోపు పూర్తయ్యేలా చూస్తామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ కూడా లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని, రైస్ మిల్లుల(Rice mills) వద్ద ధాన్యం అన్​లోడింగ్ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ జరుపుతున్నామని తెలిపారు. ఈ సీజన్​లో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం కాగా, 95 శాతం ధాన్యం సేకరణ పూర్తి చేశామని తెలిపారు. సేకరించిన ధాన్యం విలువ రూ.1,358.20 కోట్లు కాగా, అందులో 61,442 మంది రైతులకు వారి ఖాతాల్లో రూ. 1162.18 కోట్ల బిల్లుల చెల్లింపులు పూర్తయ్యాయని కలెక్టర్ వివరించారు.

Nizamabad Paddy Procurement | ట్యాబ్​ ఎంట్రీల్లో..

ట్యాబ్ ఎంట్రీలలో(Tab Entry) నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలో ఐదో స్థానంలో ఉందని, కేవలం మరో 9శాతం ట్యాబ్ ఎంట్రీలు పూర్తికావాల్సి ఉందన్నారు. రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా వేగవంతంగా రైస్ మిల్లులకు చేరవేసే విషయంలోనూ నిజామాబాద్ జిల్లా అగ్రభాగాన ఉందని, మిల్లర్ల నుండి 96శాతం మేర ఎక్​నాలెడ్జ్​మెంట్​ పూర్తయ్యిందని వివరించారు. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో సరిపడా గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయని, ధాన్యం లోడింగ్, అన్ లోడింగ్ కోసం సరిపడా హమాలీలు, లారీలను సమకూర్చామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.

ఇది కూడా చదవండి: Indiramma Houses | వారికి కూడా ఇందిరమ్మ ఇళ్లు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *