అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nampally Railway Station | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని నాంపల్లి రైల్వే స్టేషన్లో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం (Fire accident) చోటు చేసుకుంది. స్టేషన్లో నిలిపి ఉంచిన రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
నాంపల్లి నుంచి జైపూర్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు అంటుకున్నాయి. నాలుగో ప్లాట్‌ఫామ్‌పై ఉన్న రైలు ఏసీ బోగీ (AC Coach)లో మంటలు వ్యాపించాయి. ఏసీ కోచ్ B2, B3 బోగీల్లో చెలరేగిన మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఆ సమయంలో బోగీల్లో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
Nampally Railway Station | ప్రయాణికుల ఆందోళన
రైలు నుంచి పొగ దట్టంగా వ్యాపించడంతో, ప్రయాణికులు, స్థానికులలో భయాందోళనకు గురయ్యారు. అసలు ఏం జరుగుతుందోనని కాసేపు షాక్ అయ్యారు. నిమిషాల వ్యవధిలోనే మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. రైల్వే అధికారులు విచారణ చేస్తున్నారు.
A fire broke out Saturday afternoon in an AC coach of a stationary train on platform 4 at #Nampally #RailwayStation, #Hyderabad. Three fire engines rushed to the spot within minutes as thick smoke billowed from the coach, triggering panic among passengers and locals. pic.twitter.com/jvIe1OwSdd
— Ramana Reddy (@RamanaR69561502) May 15, 2026
దీనిని కూడా చదవండి : Indiramma Houses | వారికి కూడా ఇందిరమ్మ ఇళ్లు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన


