తెలంగాణRevanth Reddy Bandi Sanjay | బండి సంజయ్ తన కొడుకును వెంటనే పోలీసులకు అప్పగించాలి:...

Revanth Reddy Bandi Sanjay | బండి సంజయ్ తన కొడుకును వెంటనే పోలీసులకు అప్పగించాలి: సీఎం రేవంత్ రెడ్డి

"న్యాయం జరగాలి, బాధితులకు భరోసా కల్పించాలి. రాజకీయ పలుకుబడితో విచారణను అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదు." — రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Revanth Reddy Bandi Sanjay | కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పొక్సో (POCSO) కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పందించారు.

ఒక ప్రజా ప్రతినిధిగా బండి సంజయ్‌కు తాను సూచన చేస్తున్నానని, ఆయన నైతిక బాధ్యత వహించి తన కుమారుడిని వెంటనే పోలీసులకు అప్పగించాలని సూచించారు.

Revanth Reddy Bandi Sanjay | చట్టం ముందు అందరూ సమానులే

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “తప్పు అయినా.. ఒప్పైనా.. ఎవరైనా చట్టాన్ని గౌరవించాల్సిందే. నిలబడి విచారణను ఎదుర్కోవాలి” అని స్పష్టం చేశారు.

బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తిగా బండి సంజయ్ చట్టానికి సహకరించాలని ఆయన కోరారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎవరికీ మినహాయింపులు ఉండబోవని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.

Revanth Reddy Bandi Sanjay | పోలీసుల విచారణ వేగవంతం

ఈ కేసులో విచారణ జాప్యంపై ఇప్పటికే డీజీపీ సీవీ ఆనంద్‌ను సీఎం ప్రశ్నించారు. తక్షణమే ప్రత్యేక బృందాలను (SIT) ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు.

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో మే 8న బండి భగీరథ్‌పై మైనర్ బాలికను వేధించినట్లు ఫిర్యాదు నమోదైంది. గత కొన్ని రోజులుగా భగీరథ్ అందుబాటులో లేడని, ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు.

Revanth Reddy Bandi Sanjay | బండి సంజయ్ ఏమంటున్నారంటే..

మరోవైపు బండి సంజయ్ ఈ ఆరోపణలను ఖండించారు. తన కుమారుడిపై కుట్ర జరుగుతోందని, ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని ఆయన ఆరోపించారు.

అయితే, తన కుమారుడు తప్పు చేసి ఉంటే చట్టప్రకారం శిక్ష అనుభవించడానికి సిద్ధమని, ఎటువంటి ప్రత్యేక మినహాయింపులు కోరబోమని ఆయన ఇప్పటికే ప్రకటించారు.

ఈ కేసు ఇప్పుడు తెలంగాణలో అధికార కాంగ్రెస్ – ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. పోలీసులు భగీరథ్ కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు సమాచారం.

Khushbu | “నడకే జిమ్‌”… 32 కేజీలు తగ్గి ఆశ్చర్యపరిచిన నటి ఖుష్బూ ఫిట్‌నెస్ ప్రయాణం!

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

NEET Paper Leak | నీట్​ పేపర్​ లీకేజీలో కీలక నిందితుడి అరెస్ట్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : NEET Paper Leak | నీట్ (NEET...

Telangana Udyamakarula Committee | తెలంగాణ ఉద్యమకారులకు ‘రాజ గౌరవం’.. జర్నలిస్టులకు గుర్తింపు లభించేనా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telangana Udyamakarula Committee | స్వరాష్ట్ర కల సాకారం కోసం...

Nampally Railway Station | నాంపల్లి రైల్వే స్టేషన్​లో అగ్ని ప్రమాదం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nampally Railway Station | హైదరాబాద్ (Hyderabad)​...