Dengue Prevention Tips | దోమల నిర్మూలనపై నిర్లక్ష్యం చేయవద్దు..

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Dengue Prevention Tips | వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో డెంగీజ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్​వో రవీందర్​ గౌడ్​ పేర్కొన్నారు. పట్టణంలోని పలు కాలనీల్లో వైద్యశాఖ (Health Department), ఎల్లారెడ్డి మున్సిపల్​ వైస్ ఛైర్​పర్సన్​​ భాగ్యమ్మ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్​వో మాట్లాడుతూ.. డెంగీ రాకుండా ఉండేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ముప్పు ఉంటుందని హెచ్చరించారు.

Dengue Prevention Tips | పరీక్షలు చేయించుకోవాలి

జ్వరం, తీవ్ర జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, కళ్ల వెనుక నొప్పి వంటి లక్షణాలు ఉంటే వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలని డీఎంహెచ్​వో సూచించారు. డెంగీ లక్షణాలు కనిపించగానే వెంటనే వైద్యులను సంప్రదించాలని, సొంత వైద్యం చేసుకోవద్దని కోరారు. ఈ మేరకు ప్రజలను చైతన్యం చేసేందుకు గ్రామాల్లో అవగాహన ర్యాలీలు చేపడుతున్నట్లు వైద్య అధికారులు తెలిపారు. ప్లేట్‌లెట్లు తగ్గినప్పుడు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని, ఆలస్యం చేస్తే ప్రాణాపాయం ఉంటుందని హెచ్చరించారు.

Dengue Prevention Tips | నీరు నిల్వ ఉండకుండా చూడాలి

ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, కూలర్లు, పూల కుండీలు, టైర్లు, కొబ్బరి చిప్పల్లో నీరు ఉండకుండా ప్రతివారం శుభ్రం చేయాలని ఆయన సూచించారు. డెంగీ దోమ పగటిపూట కుడుతుందన్నారు. పూర్తి చేతుల దుస్తులు ధరించాలని, దోమ తెరలు వాడాలని అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెంగీ నిర్ధారణ పరీక్షలు, చికిత్స ఉచితంగా అందిస్తున్నామని, లక్షణాలుంటే భయపడకుండా వెంటనే ఆస్పత్రికి రావాలని వైద్యాధికారులు కోరారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: RTI Act | కామారెడ్డి బల్దియాలో స.హ.చట్టం అమలుపై నిర్లక్ష్యం..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *