Chandrababu Population Policy | మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు ఇస్తాం : ఏపీ సీఎం చంద్రబాబు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chandrababu Population Policy | ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కీలక ప్రకటన చేశారు. మూడో బిడ్డను కంటే రూ.30 వేలు, నాలుగో బిడ్డకు జన్మనిస్తే రూ.40 వేలు ఇస్తామని ప్రకటించారు.

శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) నరసన్నపేటలో సీఎం చంద్రబాబు శనివారం పర్యటించారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనాభా తగ్గుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జనాభా తగ్గుదల సమస్యగా మారిందని పేర్కొన్నారు. పిల్లలు భారం కాదు.. వాళ్లే మన సంపద అన్నారు. మూడో బిడ్డ పుట్టిన వెంటనే ఆ దంపతులకు రూ.30 వేలు, నాలుగో బిడ్డను కంటే రూ.40 వేలు వెంటనే ఇస్తామన్నారు.

Chandrababu Population Policy | పిల్లలే సంపద

ఆదాయం పెరిగాక జనాభా తగ్గుతోందని చంద్రబాబు అన్నారు. కొంతమంది ఒక మగపిల్లాడు పుడితే సరిపెట్టుకుంటున్నారని, ఆడపిల్ల పుడితేనే మరో బిడ్డ కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తాను కప్పుడు కుటుంబ నియంత్రణ కోసం పని చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం పిల్లలే సంపద అని తెలిపారు. జనాభా తగ్గిపోవడంతో కొన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు.

Chandrababu Population Policy | రాష్ట్రం పరిశుభ్రంగా ఉండాలి

ఈరోజు స్వచ్ఛాంధ్ర ప్రారంభిస్తున్నామని, స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నట్లు బాబు తెలిపారు. అధికార యంత్రాంగం, టీడీపీ కుటుంబం తనకు ఉన్న రెండు టీమ్స్ అన్నారు. తనకు మంచి పేరు వచ్చినా, చెడు పేరు వచ్చినా అధికార యంత్రాంగం వల్లే వస్తుందన్నారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. గొడ్డలి పార్టీతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి వేటు పడిందని పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏం జరగకపోయినా ఏదో జరిగినట్టు చేయడమే గొడ్డలి పార్టీ సైకాలజీ అని సెటైర్లు వేశారు. దేశంలో ఏపీ ఫేక్ న్యూస్​లో 2వ స్థానంలో ఉండటానికి ఆ పార్టీనే కారణం అన్నారు.

ఇది కూడా చదవండి..: Bhogapuram Airport Protest | రోడ్డు పనులు అడ్డుకున్న రైతులు.. జేసీబీ బకెట్​తో పక్కకు తొలగించిన అధికారులు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *