Police Transfers | పారదర్శక బదిలీలు సిబ్బందిలో విశ్వాసాన్ని పెంచుతాయి: ఎస్పీ రాజేష్ చంద్ర

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Police Transfers | పారదర్శక బదిలీలు సిబ్బందిలో విశ్వాసాన్ని పెంచుతాయని, బాధ్యతాయుత విధులకు ఇదే పునాది అని ఎస్పీ రాజేష్ చంద్ర(SP Rajesh Chandra) అన్నారు. కామారెడ్డి జిల్లా పోలీస్​ శాఖలో (Kamareddy Police) బదిలీల ప్రక్రియకు సరికొత్త నిర్వచనం ఇస్తూ ఎస్పీ శనివారం స్వయంగా బదిలీలు పోస్టింగ్​లలో పాల్గొన్నారు.

Police Transfers | తొమ్మిది మంది కానిస్టేబుళ్లకు పోస్టింగులు..

కరీంనగర్ (Karimnagar), రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి పదోన్నతిపై కామారెడ్డికి వచ్చిన 9 మంది హెడ్ కానిస్టేబుళ్లకు పూర్తి పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లు కేటాయించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ఈ కౌన్సెలింగ్‌లో ఎస్పీ స్వయంగా ప్రతి ఒక్కరితో మాట్లాడారు. వారి ప్రాధాన్యత స్టేషన్లు, జీవిత భాగస్వామి ఉద్యోగ స్థానం, సీనియారిటీ, ఆరోగ్య పరిస్థితులు, సర్వీస్ రికార్డుతో పాటు పిల్లల విద్యాభ్యాసం గురించి కూడా ఆరా తీశారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పోస్టింగ్‌లు ఖరారు చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. పోలీసులు క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీతో పనిచేస్తూ ప్రజల్లో శాఖపై నమ్మకాన్ని మరింత పెంచాలని సూచించారు. నైతిక విలువలు, సేవాభావంతో విధుల్లో నైపుణ్యం పెంచుకుని ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని దిశానిర్దేశం చేశారు. కొత్తగా పోస్టింగ్‌లు పొందిన హెడ్ కానిస్టేబుళ్లు అంకితభావంతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కె.నరసింహారెడ్డి, జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Revanth Reddy Convoy | నా కాన్వాయ్​ కోసం ట్రాఫిక్​ ఆపొద్దు.. సీఎం రేవంత్​రెడ్డి కీలక నిర్ణయం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *