అక్షరటుడే, కామారెడ్డి: Human Trafficking Awareness | ఉద్యోగాలు, వివాహాల పేరుతో మహిళలు, బాలికలను అక్రమ రవాణా చేసే ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి (Kamreddy District ), జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్ డాక్టర్ సీహెచ్వీఆర్ వరప్రసాద్ సూచించారు. శనివారం జిల్లా మహిళా సమాఖ్య భవన్‌లో మండల మహిళా ప్రతినిధులతో మానవ అక్రమ రవాణా, వాణిజ్య లైంగిక దోపిడీపై అవగాహన సదస్సు నిర్వహించారు.
Human Trafficking Awareness | హ్యుమన్ ట్రాఫికింగ్..
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉచిత న్యాయ సేవలు, చట్టపరమైన సాయం పొందే విధానాన్ని వివరించారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై కఠిన శిక్షలు ఉంటాయని, బాధితులకు ఉచిత న్యాయ సాయంతో పాటు పునరావాసం కల్పిస్తామని తెలిపారు. హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, నేరాలు గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ (District Legal Services Authority) కార్యదర్శి టి. నాగరాణి మాట్లాడుతూ.. మోసపూరిత హామీల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బాధితులు భయపడకుండా ముందుకు రావాలని సూచించారు. కామారెడ్డి పోలీస్ కళాబృందం (Kamareddy) పాటల రూపంలో మానవ అక్రమ రవాణా, మహిళల భద్రత, బాలల రక్షణపై సులభంగా అర్థమయ్యేలా సందేశాలు అందించి ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి, ఏహెచ్టీయూ ఎస్సై రామన్, ఏపీఎం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Revanth రెడ్డి Convoy | నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. సీఎం రేవంత్రెడ్డి కీలక నిర్ణయం


