తెలంగాణMP Arvind Vs MLA Sanjay | "ఎమ్మెల్యే సంజయ్ ‘జగిత్యాల జోకర్’.. రాజకీయ అంతు...

MP Arvind Vs MLA Sanjay | “ఎమ్మెల్యే సంజయ్ ‘జగిత్యాల జోకర్’.. రాజకీయ అంతు చూసేవరకు వదిలిపెట్టను”.. ఎంపీ అర్వింద్​ సంచలన వ్యాఖ్యలు

కేంద్రీయ విద్యాలయం విషయంలో ఎమ్మెల్యే సంజయ్ వైఖరిని తప్పుబడుతూ ఎంపీ అరవింద్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. "I will see your political end" (నీ రాజకీయ అంతు చూస్తాను) అంటూ ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: MP Arvind Vs MLA Sanjay | నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రాజకీయ సెగలు ఒక్కసారిగా రాజుకున్నాయి. కేంద్రీయ విద్యాలయం (కేవీ) ఏర్పాటు అంశంపై జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్​ అత్యంత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే సంజయ్‌ను ‘జగిత్యాల జోకర్’ అని అభివర్ణిస్తూ, ఆయనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

MP Arvind Vs MLA Sanjay | రాజకీయ అంతు చూసే వరకు వదిలిపెట్టను!

కేంద్రీయ విద్యాలయం విషయంలో ఎమ్మెల్యే సంజయ్ వైఖరిని తప్పుబడుతూ ఎంపీ అరవింద్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. “I will see your political end” (నీ రాజకీయ అంతు చూస్తాను) అంటూ ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు.

నియోజకవర్గ అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఇకపై ఈ విషయంలో తగ్గేదే లేదని స్పష్టం చేశారు.

MP Arvind Vs MLA Sanjay | నెక్స్ట్ రెండేళ్లు జగిత్యాల పైనే ఫోకస్

ఈ వివాదం నేపథ్యంలో ఎంపీ అరవింద్ ఒక కీలక ప్రకటన చేశారు. “వచ్చే రెండేళ్ల పాటు నేను నిజామాబాద్ వాడిని కాదు.. జగిత్యాల వాడిని” అని పేర్కొంటూ, తన పూర్తి రాజకీయ శ్రద్ధను జగిత్యాల నియోజకవర్గంపైనే పెట్టబోతున్నట్లు ప్రకటించారు.

రేపటి నుంచి నిజామాబాద్‌కు కొంత గ్యాప్ ఇచ్చి, జగిత్యాలలోనే మకాం వేసి అక్కడి రాజకీయాలను, ప్రజా సమస్యలను దగ్గరుండి చూసుకుంటానని తెలిపారు.

MP Arvind Vs MLA Sanjay | వేడెక్కిన రాజకీయం:

ఎంపీ అర్వింద్​ చేసిన ఈ తాజా సవాల్‌తో జగిత్యాల జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఒకవైపు కేంద్రీయ విద్యాలయం చుట్టూ తిరుగుతున్న వివాదం, మరోవైపు “రాజకీయ అంతు చూస్తా” అంటూ ఎంపీ ఇచ్చిన వార్నింగ్.. రాబోయే రోజుల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మరింత బలమైన రాజకీయ యుద్ధానికి దారితీసేలా కనిపిస్తోంది. మరి ఎంపీ అర్వింద్​ సవాల్‌పై ఎమ్మెల్యే సంజయ్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Southwest Monsoon Kerala | ఈ నెల 26న కేరళ తీరానికి నైరుతి రుతుపవనాలు..మరో నాలుగైదు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశం

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bandi Bhagirath POCSO | బండి భగీరథ్ విచారణ పూర్తి.. మేడ్చల్ ఆసుపత్రికి తరలింపు.. మెజిస్ట్రేట్ నివాసం వద్ద భారీ భద్రత!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bandi Bhagirath POCSO | రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం...

Jayam Ravi Divorce | ‘నా భార్య విడాకులు ఇచ్చేవరకు సినిమాలు చేయను’ – జయం రవి సంచలన ప్రకటన!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Jayam Ravi Divorce | డబ్బు, హోదా, కోట్లాది...

Adhika Jyeshta Masam | ఒకే ఏడాది రెండు జ్యేష్ఠ మాసాలు.. దీని గురించి శాస్త్రం ఏం చెబుతోందంటే

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Adhika Jyeshta Masam | జ్యోతిషశాస్త్రంలో అత్యంత పవిత్రమైన, అరుదైన...

Chola Copper Plates | 14 ఏళ్ల నిరీక్షణకు తెర.. స్వదేశానికి ‘చోళుల కాలం నాటి రాగి శాసనాలు’!

Chola Copper Plates | భారతీయ సాంస్కృతిక వారసత్వ పునరుద్ధరణలో మరో...