Revanth Reddy Visit | రేపు భూపాలపల్లి జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి

Naresh Chandan
Revanth Reddy Visit

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Revanth Reddy Visit | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు (సోమవారం) భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసిద్ధ శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు.akshara today .jpgkaleshwa

Revanth Reddy Visit | రూ.230 కోట్ల వ్యయంతో

కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్​ భూమిపూజ చేయనున్నారు. దాదాపు రూ.230 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఆలయానికి మరింత వన్నె తెచ్చేలా, ఇక్కడి ప్రాంతీయ పర్యాటకాన్ని అభివృద్ధి చేసేలా ఉండనున్నట్లు చెబుతున్నారు.akshara today .jpgswami

ఈ పర్యటనలో భాగంగా అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. స్థానిక అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి: KCR Jagtial Sabha | గులాబీ బాస్ ఆగమనం.. 20న జగిత్యాలలో బహిరంగ సభ.. బీఆర్ఎస్ కు పూర్వ వైభవం వచ్చేనా!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *