Yellareddy Heavy Rains | ఎల్లారెడ్డి–కామారెడ్డి రహదారిపై చెట్లకొమ్మలు తొలగింపు

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Heavy Rains | ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి ఎల్లారెడ్డి–కామారెడ్డి (Yellareddy) రహదారిపై సోమవారం సాయంత్రం చెట్లు కూలిపోగా మున్సిపల్ కమిషనర్(Municipal Commissioner) జగ్జీవన్ స్పందించారు. వెంటనే తొలగింపు చర్యలు చేపట్టారు.

Yellareddy Heavy Rains | మున్సిపల్​, పారిశుధ్య సిబ్బందితో కలిసి..

మున్సిపల్, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర కూలీలతో కలిసి ఆయన చెట్లకొమ్మలను తొలగించారు. రోడ్డుపై అడ్డంగా పడిన చెట్లను, కొమ్మలను యుద్ధప్రాతిపదికన తొలగిస్తున్నారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ తెలిపారు. వర్షం, ఈదురు గాలులు వస్తున్న సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, శిథిలావస్థలో ఉన్న భవనాలు, చెట్ల కింద నిలబడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

Yellareddy Heavy Rains | విద్యుత్​ సరఫరాను పునరుద్ధరించాలి..

మండలంలో పలుచోట్ల తెగిపడిన విద్యుత్ తీగలను, స్తంభాలను సైతం త్వరగా పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌కో(Transco) అధికారులను కమిషనర్ జగ్జీవన్ కోరారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పంటలను రక్షించుకునేందుకు తప్పనిసరిగా టార్పాలిన్లను వినియోగించుకోవాలని, వాతావరణ హెచ్చరికలు గమనిస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ పరిధిలో తెగిపోయిన విద్యుత్ తీగలను సైతం పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆయన సూచించారు.

muin3 mun1 mun44 rakeuu

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *