Red Sand Boa Smuggling | రెండు తలల పాములు విక్రయించేందుకు యత్నం.. నిందితుడి అరెస్ట్

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Red Sand Boa Smuggling | రెండు తలల పాము ఇంట్లో ఉంటే మంచిదని చెప్పి విక్రయించేందుకు యత్నించిన ఓ వ్యక్తిని అధికారులు అరెస్ట్​ చేశారు. వరంగల్ (Warangal) స్టింగ్ ఆపరేషన్‌లో ఇండియన్ రెడ్ సాండ్ బోవాలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అక్రమ వన్యప్రాణుల వ్యాపారానికి వ్యతిరేకంగా డీఆర్ఐ హైదరాబాద్ (Hyderabad) జోనల్ యూనిట్ అధికారులు ఆదివారం వరంగల్‌లో రహస్య ఆపరేషన్ నిర్వహించారు. ప్రాణంతో ఉన్న రెండు ఇండియన్ రెడ్ సాండ్ బోవాలను విక్రయించడానికి ప్రయత్నిస్తున్నాడనే ఆరోపణలపై ఒక అనుమానితుడిని అధికారులు అడ్డుకున్నారు. నిందితుడు తీసుకువెళ్తున్న బ్యాగ్ నుండి రెండు పాములను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పాములను, నిందితుడిని వరంగల్ రేంజ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌కు అప్పగించారు.

Red Sand Boa Smuggling | పక్కా సమాచారం మేరకు..

ఒక వ్యక్తి సజీవ పాముల అక్రమ వ్యాపారంలో పాలుపంచుకుంటున్నాడని, వరంగల్‌లో వాటిని విక్రయించడానికి ప్రయత్నిస్తున్నాడని డీఆర్ఐకి సమాచారం అందింది. దీంతో అధికారులు రహస్య ఆపరేషన్​ నిర్వహించారు. ఈ జాతి పాముల వ్యాపారం, స్వాధీనం, రవాణా లేదా అమ్మకం చట్టరీత్యా నిషేధమని అధికారులు తెలిపారు. ఈ పాము విషరహితమైనది. ఇది ఇంట్లో ఉంటే మంచిదనే మూఢ నమ్మకం ఉంది. దీంతో ఈ జాతి పాములను అక్రమ వన్యప్రాణి వ్యాపారులు లక్ష్యంగా చేసుకుంటున్నారు.

 

దీనిని కూడా చదవండి : Australia Massage Abuse | మసాజ్ పేరుతో 61 మందిపై వేధింపులు.. భారత సంతతి వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *