తెలంగాణRajiv Swagruha Plots | రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్ల వేలం.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం

Rajiv Swagruha Plots | రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్ల వేలం.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం

రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఓపెన్ ప్లాట్ల కొనుగోలుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని అధికారులు తెలిపారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajiv Swagruha Plots | రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఓపెన్ ప్లాట్ల కొనుగోలుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని అధికారులు తెలిపారు. ఫ్యూచర్ సిటీకి, అవుటర్ రింగ్ రోడ్ (ORR) కు సమీపంలో రంగారెడ్డి (Rangareddy), మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలలోని తొర్రూర్ (66 ప్లాట్లు), కుర్మల్​గూడ (11), బహదూర్ పల్లి (8) ప్రాంతాల్లో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ (Rajiv Swagruha Corporation)కు చెందిన 85 ఓపెన్ ప్లాట్ల విక్రయానికి సోమవారం బహిరంగ వేలం నిర్వహించారు.

పెద్ద అంబర్​పేటలోని ఒక ప్రైవేట్​ ఫంక్షన్ హాల్​లో నిర్వహించిన బహిరంగ వేలంలో పాల్గొన్న బిడ్డర్లు చదరపు గజానికి నిర్దేశించిన దానికంటే అధిక మొత్తంతో ఈ ప్లాట్లను కొనుగోలు చేశారు. ఈ ప్లాట్ల విక్రయం ద్వారా సుమారు రూ.83 కోట్ల మేర ఆదాయం వచ్చిందని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ గౌతం తెలిపారు.

Rajiv Swagruha Plots | తొర్రూర్​లో​ గజానికి రూ.45.50 వేలు

తొర్రూల్ లే అవుట్ లో ప్లాట్​ను కొనుగోలు చేయడానికి బిడ్డర్లు పోటీ పడ్డారు. గరిష్టంగా చదరపు గజం స్థలాన్ని రూ.45,500 వేలకు దక్కించుకున్నారు. ఓఆర్ఆర్, ఆదిభట్ల ఐటీ క్యారిడార్​కు సమీపంలో ఉన్న తొర్రూర్​లో 200 -700 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న 66 ప్లాట్లకు (plots) చదరపు గజానికి కనీస ధర 25 వేల రూపాయలుగా నిర్దారించగా, సగటున రూ. 32,500 ధర పలికిందన్నారు.

Rajiv Swagruha Plots | కుర్మల్​గూడలో..

ఎయిర్ పోర్టు (Airport), ఆర్సీఐకి దగ్గర్లో ఉన్న కుర్మల్​గూడో 200 నుంచి 400 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్లకు గజానికి కనీస ధర 20 వేల నిర్ణయించారు. గరిష్టంగా రూ.27,500 ధర పలికింది. బహదూర్​పల్లి ప్రాంతంలో 200 నుంచి 1000 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్లకు వేలం వేశారు. ఇక్కడ చదరపు గజం కనీస ధర రూ.27 వేలుగా నిర్ణయించగా, వేలం పాటలో గరిష్టంగా రూ.40,500 ధర పలికింది. వేలంలో సగటున ఈ భూములకు గజం రూ.33,800కు కొనుగోలు చేశారు.

దీనిని కూడా చదవండి : Warangal Police | రౌడీ షీటర్లను రోడ్లపై తిప్పిన పోలీసులు

 

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hyderabad Water Supply | హైదరాబాద్ వాసులకు అలెర్ట్​.. నీటి సరఫరాలో అంతరాయం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Water Supply | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు...

Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పర్చుకుని ముందుకు సాగాలి..

అక్షరటుడే, ఆర్మూర్: Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని...

Tourist Guide Recruitment | టూరిస్ట్ గైడ్‌ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tourist Guide Recruitment | టూరిస్ట్​ గైడ్​ల...

Assistant Professor Merit List | మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Assistant Professor Merit List | ప్రభుత్వ మెడికల్...