Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పర్చుకుని ముందుకు సాగాలి..

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్: Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పర్చుకుని ముందుకు సాగాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) (Local Bodies) దిలీప్ కుమార్ అన్నారు. ఆదివాసి నాయకపోడ్ విద్యార్థులకు (nayakpod students) పట్టణంలోని (Armoor) పెర్కిట్(Perkit) గ్రామ శివారులో భీమన్న కల్యాణ మండపంలో ప్రతిభా పురస్కారాలు అందజేశారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

Tribal Student Awards | జిల్లా ఆదివాసి నాయకపోడ్..

జిల్లా ఆదివాసి నాయకపోడ్ ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో, సేవా సంఘం సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా ఉద్యోగుల సేవా సంఘం అధ్యక్షుడు పుట్ట రాజేశ్వర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా దిలీప్​ కుమార్​ మాట్లాడుతూ.. విద్యార్థులను ప్రోత్సహించడానికి ఇలాంటి ప్రతిభా పురస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. సివిల్స్ లాంటి పెద్ద లక్ష్యాలను టార్గెట్ చేసుకుంటే, కనీసం గ్రూప్-1 ఆఫీసర్లుగానైనా(Group-1 Officers) స్థిరపడవచ్చన్నారు. అనంతరం ఎస్సెస్సీ(SSC), ఇంటర్మీడియట్ (Intermediate), ఉన్నత చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సుమారు 100 మంది విద్యార్థులను జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా డీఆర్​డీఏ పీడీ సాయన్న, జిల్లా అధ్యక్షుడు గాండ్ల రాంచందర్, సీనియర్ హైకోర్టు న్యాయవాది రాచమల్లు ప్రశాంత్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: India Nordic Summit | ఇండియా – నార్డిక్​ సమ్మిట్​లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *