అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tourist Guide Recruitment | టూరిస్ట్ గైడ్ల నియామకం కోసం ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
తెలంగాణ ప్రభుత్వ వారసత్వ, పర్యాటక శాఖలు, పురావస్తు, చారిత్రక, వారసత్వ పర్యాటక ప్రదేశాలలో టూరిస్ట్ గైడ్ ప్రోగ్రామ్ కోసం తెలంగాణలోని 33 జిల్లాల నుండి పట్టభద్రుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి. మంచి సంభాషణా నైపుణ్యాలు కలిగి, పురావస్తు శాస్త్రం, చరిత్ర, వారసత్వం, సంస్కృతి, కళ, వాస్తుశిల్పం, పర్యాటకం పట్ల ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Tourist Guide Recruitment | ఇలా దరఖాస్తు చేయాలి
ఆసక్తి గల అభ్యర్థులు https://docs.google.com/forms/d/e/1FAIpQLSdfLenWj-5csepK7CfawDDJEWC21PJaGbDjT8M0wsYS8k_9ww/viewform?pli=1 లింక్‌ను క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. వ్యక్తిగత వివరాలు, టూరిస్ట్ గైడ్‌గా అనుభవం ఉంటే ఆ వివరాలు నమోదు చేయాలి. పాస్‌పోర్టు సైజ్ ఫొటో, డిగ్రీ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి.
దీనిని కూడా చదవండి : Government Job Age Limit | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. వయో పరిమితి పెంచిన ప్రభుత్వం