బిజినెస్​May 20 Gold Rates | పెరిగిన పసిడి ధర.. తగ్గిన వెండి రేట్​!

May 20 Gold Rates | పెరిగిన పసిడి ధర.. తగ్గిన వెండి రేట్​!

అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితుల ప్రభావంతో బంగారం ధరలు మరోసారి హెచ్చుతగ్గులను నమోదు చేస్తున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,050కు చేరుకోగా, వెండి ధరలు తగ్గుముఖం పట్టి కిలో రూ.3 లక్షల దిగువకు చేరాయి.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 20 Gold Rates | ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, డాలర్ మారకపు విలువల్లో మార్పులు వంటి అంశాల ప్రభావంతో బంగారం ధరలు Gold Rates రోజురోజుకు హెచ్చుతగ్గులను నమోదు చేస్తున్నాయి.

గత వారం నుంచి కొనసాగుతున్న ధరల మార్పులు ఈ వారం కూడా కొనసాగుతున్నాయి. వారాంతంలో తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు, మళ్లీ స్వల్పంగా పెరిగి వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

May 20 Gold Rates | హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం, మే 20 ఉదయం 6:30 గంటల సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1,57,050గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర రూ.1,43,960గా కొనసాగుతోంది.

May 20 Gold Rates | వెండి ధ‌ర‌లు..

వెండి ధరల్లో Silver Rates మాత్రం తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,99,900గా ఉంది. ఇటీవల కొన్ని రోజులుగా వెండి ధరలు కూడా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,230గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,710గా నమోదైంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,57,050గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,43,960గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,200గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,960 వద్ద కొనసాగుతోంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే దేశవ్యాప్తంగా కిలో వెండి ధరలు రూ.3 లక్షల దిగువకు చేరుకున్నాయి. ప్రస్తుతం వివిధ నగరాల్లో కిలో వెండి ధరలు రూ.2.84 లక్షల నుంచి రూ.2.99 లక్షల మధ్య కదలాడుతున్నాయి.

May 20 Gold Rates | మరింత ప్రభావం

అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు కూడా విలువైన లోహాల ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 4,491 డాలర్ల Dollars వద్ద ట్రేడవుతుండగా, వెండి ధర ఔన్స్‌కు 74 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, కేంద్ర బ్యాంకుల విధానాలు, డాలర్ బలపడటం లేదా బలహీనపడటం వంటి అంశాలు రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో పెట్టుబడిదారులు, బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు మార్కెట్ పరిస్థితులను జాగ్రత్తగా గమనించాలని సూచిస్తున్నారు.

Matrimonial fraudster arrested | మెడలో తాళి కడతానని.. అకౌంట్ ఖాళీ చేస్తాడు.. మాట్రిమోని కిలాడీ ‘కామేషు’ వేషాలు మామూలుగా లేవుగా!

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hyderabad Fire Accident | హైదరాబాద్​లో మరో అగ్ని ప్రమాదం

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyderabad Fire Accident | హైదరాబాద్​ నగరంలో గురువారం...

Visakhapatnam Infrastructure Funds|విశాఖలో 3 భారీ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అక్షరటుడు వెబ్‌డెస్క్:Visakhapatnam Infrastructure Funds|విశాఖపట్నం(Visakhapatnam) నగరంలో మౌలిక వసతుల ఆధునీకరణ, పట్టణాభివృద్ధి...

Stock Market Gains | లాభాల్లో మార్కెట్లు..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock Market Gains | పశ్చిమాసియాలో నాటకీయ పరిణామాలు...

Chandrababu Convoy | సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లో కొత్త మార్పులు.. భద్రత కోసం రెండు మినీ బస్సులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Chandrababu Convoy | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి...