Gachibowli Fire Accident | గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం.. 15 బైక్​లు దగ్ధం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gachibowli Fire Accident | హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని గచ్చిబౌలిలో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టీఎన్​జీవోస్​ కాలనీ (TNGOs Colony)లోని ఓ అపార్ట్​మెంట్​లో మంటలు చెలరేగాయి.

అపార్ట్​మెంట్​లోని సెల్లార్​లో మంటలు అంటుకున్నాయి. అనంతరం నలువైపులా వ్యాపించాయి. ఈ ఘటనలో సెల్లార్​లో పార్క్​ చేసిన 15 ద్విచక్ర వాహనాలు దగ్ధం అయ్యాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో అపార్ట్​వాసులు భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురి కాగా.. మిగతా వారు సురక్షితంగా బయట పడ్డారు.

Gachibowli Fire Accident

Gachibowli Fire Accident | షార్ట్​ సర్క్యూట్​తో..

అగ్ని ప్రమాదం (Fire Accident)పై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. పై అంతస్తుల్లో చిక్కుకున్న వారిని రక్షించారు. సెల్లార్​లో షార్ట్​ సర్క్యూట్​తో మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా నగరంలో అనేక భవనాల్లో ఫైర్​ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదు. గతంలో నాంపల్లిలోని ఓ ఫర్నిచర్​ షోరూమ్​లో అగ్ని ప్రమాదం జరిగి 5గురు చనిపోయారు. ఇటీవల అనేక అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయినా అధికారులు చర్యలు చేపట్టడం లేదు.

గతంలో నాలుగు రోజులు తనిఖీల పేరిట హైడ్రా, అగ్నిమాపక, జీహెచ్​ఎంసీ అధికారులు (GHMC Officers) హడావుడి చేశారు. ఫైర్​ సేఫ్టీ నిబంధనలు పాటించని పలు వ్యాపార సంస్థలను సీజ్​ చేశారు. అనంతరం వ్యాపారుల వినతి మేరకు తనిఖీలకు నెల రోజుల విరామం ఇస్తున్నట్లు హైడ్రా కమిషనర్​ తెలిపారు. అయితే ఆ విరామం గడువు ముగిసినా.. ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. దీంతో నగరంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటూనే ఉంది.

ఇది కూడా చదవండి..: Heavy Rain Alert | నేడు పలు జిల్లాలకు వర్ష సూచన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *