అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad Metro | హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపర్చడంలో మరో కీలక అడుగు పడింది. మెట్రో సెకండ్ ఫేజ్‌కు కేంద్ర ప్రభుత్వం (Central Government) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండో దశకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) సమావేశం అయ్యారు.
Hyderabad Metro | కీలక ప్రాజెక్టులపై సమీక్ష
ఢిల్లీలో కేంద్రమంత్రిలో జరిగిన సమావేశం సందర్భంగా హైదరాబాద్ (Hyderabad)లో కొనసాగుతున్న వివిధ కీలక ప్రాజెక్టులపై సమీక్షించారు. నగరంలో మౌలిక వసతులు, పారిశుధ్యం, ప్రజారవాణాపై చర్చించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
Hyderabad Metro | సూత్రప్రాయంగా అంగీకారం
భేటీలో హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుపై చర్చ జరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. మెట్రో సెకండ్ ఫేజ్‌కు కేంద్ర మంత్రి సూత్రప్రాయంగా అంగీకరించారని పేర్కొన్నారు. డీపీఆర్ అందిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారని చెప్పారు. అయితే కేంద్ర, రాష్ట్రాలు 50:50 పద్ధతిలో ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి..: Lakshmi Kumar Remand | జలమండలి జీఎం లక్ష్మీకుమార్‌కు 14 రోజుల రిమాండ్


