UP Encounters | అక్కడ రోజుకు ఐదు ఎన్‌కౌంటర్లు కామన్.. నేరస్తుల గుండెల్లో వణుకుపుట్టించిన యోగి

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: UP Encounters | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ 2017 మార్చి లో అధికారం చేపట్టారు. ఆయన ‘జీరో టాలరెన్స్’కు ప్రాధాన్యత ఇచ్చారు. నేర సామ్రాజ్యానికి అడ్డాగా మారిన యూపీని మార్చేందుకు కఠినంగా వ్యవహరించారు. సీఎం ఇచ్చిన స్వేచ్ఛతో పోలీసులు విజృంభించారు. చట్టాలకు విలువ ఇవ్వని కరడుగట్టిన నేరగాళ్లకు తూటాలతో బదులివ్వడం ప్రారంభించారు.

UP Encounters | తొమ్మిదేళ్లలో 17 వేల ఎన్‌కౌంటర్లు..

యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సీఎం అయ్యాక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు ఎన్‌కౌంటర్లు భారీగా పెరిగాయి. అధికారిక డేటా ప్రకారం 2017 నుంచి 2026 ప్రారంభం వరకు 17,043 ఎన్‌కౌంటర్ ఆపరేషన్లు జరిగాయి. ఇందులో సుమారు 289 మంది నేరస్తులు మరణించారు. ఒక్క 2025 సంవత్సరంలోనే 48 మంది ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. ఆయా ఎన్‌కౌంటర్‌లలో 11 వేల మందికిపైగా గాయపడ్డారు. 34 వేల మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక చావు భయంతో స్వచ్ఛందంగా లొంగిపోయిన నేరస్తుల సంఖ్య వేలల్లో ఉంటుంది. మీరట్, వారణాసి, బరేలీ జోన్లలో ఎన్‌కౌంటర్లు ఎక్కువగా జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి.

UP Encounters | 18 మంది పోలీసుల వీరమరణం..

నేరాలను అదుపు చేసేందుకు యూపీలో జరుగుతున్న ఎన్‌కౌంటర్లలో పోలీసులు సైతం మృత్యువాతపడ్డారు. ఈ తొమ్మిదేళ్లలో 18 మంది పోలీసులు వీరమరణం పొందారు. 1,852 మంది పోలీస్ సిబ్బంది గాయపడ్డారని నివేదికలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి..: EPFO WhatsApp | పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. త్వరలో వాట్సాప్ ద్వారా సేవలు!

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *