Medical Shops Bandh | ప్రశాంతంగా కొనసాగుతున్న మెడికల్ షాపుల బంద్

shashi kiran Mottala

అక్షరటుడే, కోటగిరి: Medical Shops Bandh | ఉమ్మడి కోటగిరి మండలంలో మెడికల్​ షాప్​ల బంద్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆన్​లైన్​లో మందుల అమ్మకాల కోసం తెచ్చిన జీవో.817ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ (Organization of Chemists and Druggists) బంద్​కు పిలుపునిచ్చిన విషయం విదితమే. ఈ సందర్భంగా నిర్వాహకులు మండలంలోని మెడికల్​ దుకాణాలను మూసివేసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

Medical Shops Bandh | మెడికల్​ షాప్​లపై తీవ్ర ప్రభావం..

ఈ సందర్భంగా కోటగిరి (kotagiri), పోతంగల్ (Pothangal) మండలాల మెడికల్ షాపుల అసోసియేషన్ అధ్యక్షుడు బర్ల సాయిలు, ప్రధాన కార్యదర్శి సితాలే విజయ్ మాట్లాడుతూ.. ఆన్​లైన్​ ద్వారా మందులు (online medicine sales) విక్రయాలు చేయడం, అధికంగా డిస్కౌంట్ ఇవ్వడం ద్వారా నాసిరకమైన మందులు మార్కెట్లో చలామణి అవుతున్నాయన్నారు. అలాగే చిన్న మెడికల్ షాప్​లపై తీవ్ర ప్రభావం చూపడంతో ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోకపోవడంతో దేశవ్యాప్తంగా మెడికల్ షాప్​ల బంద్ పాటిస్తున్నామన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి జీవో 817ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాగ భూషణం గౌడ్, దేవుడి సాయిలు, సాయాగౌడ్, నరేందర్, లింగారాం, గోపాల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: UP Encounters | అక్కడ రోజుకు ఐదు ఎన్‌కౌంటర్లు కామన్.. నేరస్తుల గుండెల్లో వణుకుపుట్టించిన యోగి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *