అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Legal Metrology Rules | లీగల్ మెట్రాలజీ నిబంధనల సవరణల ప్రతిపాదనలపై నిరంతరం నిఘా అవసరమని భారతీయ వినియోగదారుల మండలి రాష్ట్ర కార్యదర్శి సందు ప్రవీణ్ అన్నారు. అంతర్జాతీయ లీగల్ మెట్రాలజీ డే (Legal Metrology Day) సందర్భంగా పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి శ్రీకాంత్ రెడ్డి (DSO), ఏఎస్వో (Civil Supplies Department) అరవింద్ రెడ్డి ఆధ్వర్యంలో పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Legal Metrology Rules | మార్కెట్లో మోసాలపై కట్టడి అవసరం..
ఈ సందర్భంగా సందు ప్రవీణ్ మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో మోసాలను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సూపర్ మార్కెట్లు, కూరగాయలు, చేపల మార్కెట్లు, బంగారు దుకాణాల్లో నిత్యం వందలసార్లు తూకాలు వాడుతుంటారని (weighing machine checks) వాటిలో చిన్నపాటి తేడాలు కూడా వినియోగదారులను (consumer rights) నష్టపరుస్తాయన్నారు. ఈ మోసాలను అరికట్టేందుకు లీగల్ మెట్రాలజీ అధికారులు ఏటా తనిఖీలు నిర్వహించి తూకాలను సరిచేసి స్టాంపింగ్ వేయడం ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు. అయితే లీగల్ మెట్రాలజీ అధికారుల తనిఖీల కాలపరిమితిని ఒక ఏడాది నుంచి మూడు లేదా ఐదేళ్లకు పెంచాలని ప్రతిపాదిస్తున్నారన్నారు.
ఈ నిర్ణయం అమల్లోకి వస్తే తూకాలు, ఎలక్ట్రానిక్ కాంటాల ట్యాంపరింగ్ విపరీతంగా పెరిగిపోతుందన్నారు. వినియోగదారుల హక్కులు నామమాత్రంగా మిగిలిపోతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం వినియోగదారుల మండలి నిజామాబాద్ జిల్లా విభాగం ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండలి ఉపాధ్యక్షుడు వీఎన్ వర్మ, కోశాధికారి మహాదేవుని శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Caste Census Support| బీసీలు ఎదగడం మోదీకి ఇష్టం లేదు.. వీహెచ్ సంచలన వ్యాఖ్యలు


