క్రైంKamareddy SP | పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి: ఎస్పీ

Kamareddy SP | పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి: ఎస్పీ

కామారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఉన్న పెండింగ్ కేసుల దర్యాప్తులో వేగం పెంచాలని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నెలవారీ సమీక్ష నిర్వహించారు.

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఉన్న పెండింగ్ కేసుల దర్యాప్తులో వేగం పెంచాలని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో (Kamareddy SP Ofiice) బుధవారం నెలవారీ సమీక్ష నిర్వహించారు.

Kamareddy SP | బక్రీద్​ సందర్భంగా..

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రాబోయే బక్రీద్ (bakrid) పండుగ సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. చెక్‌పోస్టుల వద్ద నిరంతర తనిఖీలు చేపట్టి సిబ్బందికి తగిన సూచనలు ఇవ్వాలని స్పష్టం చేశారు. కోర్టు ట్రయల్‌లో ఉన్న కేసులపై సమీక్ష నిర్వహించిన ఆయన.. ప్రతి కేసులో సాక్షులు, ముద్దాయిలకు సమన్లు తప్పనిసరిగా అందేలా చూసి నేరస్తులకు త్వరగా శిక్ష పడేలా (Crime Investigation) సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలన్నారు. జిల్లాలోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్ల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారిపై గట్టి నిఘా ఉంచాలని, వారి వివరాలను అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. ఈ నెలలో నమోదైన కేసులను పోలీస్ స్టేషన్ వారీగా సమీక్షించి, త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు.

Kamareddy SP | పెండింగ్​ కేసులపై ప్రత్యేక దృష్టి..

పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని పరిశీలించి, వీలైనంత త్వరగా పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ అన్నారు. ప్రజల్లో సీసీ కెమెరాల (CCTV Awareness) ప్రాధాన్యతపై అవగాహన కల్పించి, కొత్త కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, మహిళలపై నేరాల్లో వేగవంతమైన విచారణ చేపట్టి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

యువత ఆన్‌లైన్ బెట్టింగ్ వలలో పడకుండా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, బెట్టింగ్‌ను ప్రోత్సహించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, ఎల్లారెడ్డి (Yellareddy) డీఎస్పీ శ్రీనివాస్, బాన్సువాడ (Banswada) డీఎస్పీ విఠల్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్, సీఐలు, ఎస్సైలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:Telangana Prisoner Release|ఖైదీల ముందస్తు విడుదలకు గవర్నర్ కీలక నిర్ణయం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

 Tamil Nadu Cabinet Expansion | తమిళనాడు మంత్రివర్గ విస్తరణ.. ఆరు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్​కు​ మంత్రి పదవులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tamil Nadu Cabinet Expansion | తమిళనాడు ముఖ్యమంత్రి...

Oil Tankers in Hormuz  | భారత్ సాహసం.. హార్ముజ్ జలసంధిలోకి చమురు నౌకలు!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oil Tankers in Hormuz  | పశ్చిమాసియాలో నెలకొన్న...

Bus Stone Attack | బస్సు ఆపలేదని రాయితో దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు

అక్షరటుడే, కామారెడ్డి: Bus Stone Attack | బస్సు ఆపడం లేదని...