KCR Jagtial Meeting | నేడు జగిత్యాలకు గులాబీ బాస్​.. ఏడాది తర్వాత కేసీఆర్​ సభ

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KCR Jagtial Meeting | మాజీ సీఎం, బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ నేడు జగిత్యాలలో పర్యటించనున్నారు. బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.

మాజీ మంత్రి, సీనియర్​ నేత జీవన్​రెడ్డి (Jeevan Reddy) ఇటీవల కాంగ్రెస్​కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన నేడు బీఆర్​ఎస్​లో చేరనున్నారు. కేసీఆర్​ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. దీని కోసం జగిత్యాల (Jagtial)లో బీఆర్​ఎస్​ నేతలు ప్రజా ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ కోసం పక్కాగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్​, హరీశ్​రావు సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సభను విజయవంతం చేయడానికి బీఆర్​ఎస్​ శ్రేణులు ఇప్పటికే ప్రణాళికలు రచించారు. ఉమ్మడి కరీంనగర్​ నుంచి భారీగా జన సమీకరణ చేయడానికి సిద్ధం అయ్యారు.

KCR Jagtial Meeting

KCR Jagtial Meeting | కేసీఆర్​ పర్యటన వివరాలు

జగిత్యాల పర్యటన కోసం కేసీఆర్​ సాయంత్రం 4:30 గంటలకు ఎర్రవల్లి ఫామ్​హౌజ్​ (Erravalli Farmhouse) నుంచి హెలిక్యాప్టర్​ ద్వారా బయలు దేరుతారు. 5:10 గంటలకు జగిత్యాల కలెక్టరేట్​కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జగిత్యాల బీఆర్​ఎస్​ పార్టీ (BRS Party) ఆఫీస్​కు చేరుకుంటారు. సాయంత్రం 6:30 గంటలకు మినీ స్టేడియంలోని సభ స్థలికి చేరుకుంటారు. రాత్రి 9 గంటలకు జగిత్యాల నుంచి తిరుగు పయనం అవుతారు.

KCR Jagtial Meeting | గులాబీ శ్రేణుల్లో జోష్​

కేసీఆర్​ (KCR) దాదాపు ఏడాది తర్వాత బహిరంగ సభలో పాల్గొననుండటంతో బీఆర్​ఎస్​ శ్రేణుల్లో జోష్ నెలకొంది. గతేడాది జరిగిన బీఆర్​ఎస్​ రజతోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. అనంతరం జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు జరిగిన ఆయన బయటకు రాలేదు. ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో బీఆర్​ఎస్​ శ్రేణులకు సూచనలు చేసిన ఆయన బహిరంగ వేదికల్లో మాత్రం మాట్లాడలేదు. ఈ క్రమంతో తాజాగా గులాబీ బాస్​ సభ నిర్వహిస్తుండటం బీఆర్​ఎస్​లో జోష్​ నెలకొంది. త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ప్రభుత్వం నిర్వహించడానికి సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో కేసీఆర్​ సభ ఆ పార్టీలో ఉత్సాహం నింపనుంది.

ఇది కూడా చదవండి..: Revanth Reddy Visit | రేపు భూపాలపల్లి జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *