అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mega 158 Launch | హైదరాబాద్ (Hyderabad)లో మెగా అభిమానులను ఉత్సాహంతో నింపేసిన ఓ భారీ సినీ వేడుక ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక 158వ చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. ప్రస్తుతం తాత్కాలికంగా ‘మెగా 158’గా పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన లాంచ్ ఈవెంట్ అత్యంత వైభవంగా నిర్వహించారు. మెగాస్టార్ సినిమా అంటేనే అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి.
అలాంటిది చిరంజీవి (Megastar Chiranjeevi) కెరీర్‌లో మరో భారీ చిత్రం ప్రారంభం కావడంతో ఈ వేడుకపై అందరి దృష్టి పడింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు కొల్లి బాబీ (Director Kolli Bobby)తో పాటు చిత్ర బృందం సభ్యులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేదిక మొత్తం మెగా అభిమానుల సందడితో కళకళలాడిపోయింది. ఈ సినిమా ప్రారంభ వేడుకను కేవలం పూజా కార్యక్రమంగా కాకుండా, ఒక ప్రత్యేక సినీ వేడుకలా మేకర్స్ నిర్వహించడం ఆకట్టుకుంది.
Mega 158 Launch | క్లాప్ కొట్టిన పవన్..
ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది పవన్ కళ్యాణ్ . ఆయన స్వయంగా క్లాప్ కొట్టి సినిమాను అధికారికంగా ప్రారంభించడం అభిమానుల్లో మరింత జోష్ నింపింది. పవన్ కళ్యాణ్ క్లాప్ ఇవ్వగానే వేదిక మొత్తం కేరింతలతో మార్మోగిపోయిందని చెప్పాలి. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియోలు, ఫొటోలు వేగంగా వైరల్ అవుతున్నాయి. మరోవైపు మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన రామ్ చరణ్ ఈ వేడుకకు హాజరుకాలేకపోవడం కొంత నిరాశ కలిగించింది. అయితే మిగతా మెగా కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు పాల్గొనడంతో ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది.
Mega 158 Launch | భారీ బడ్జెట్‌తో..
ఈ భారీ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. సాంకేతికంగా కూడా సినిమా అత్యున్నత ప్రమాణాలతో రూపొందించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా విషయంలో అభిమానుల్లో అంచనాలు పెరగడానికి మరో ప్రధాన కారణం ఉంది. గతంలో చిరంజీవి–బాబీ కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. మాస్ ఎలిమెంట్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆ సినిమా ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు అదే కాంబినేషన్ మళ్లీ రిపీట్ కావడంతో ‘మెగా 158’పై భారీ హైప్ ఏర్పడింది.
ఇది కూడా చదవండి..: Suniel Narang Resignation| ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ హఠాత్ రాజీనామా


