అక్షరటుడు వెబ్‌డెస్క్:Visakhapatnam Infrastructure Funds|విశాఖపట్నం(Visakhapatnam) నగరంలో మౌలిక వసతుల ఆధునీకరణ, పట్టణాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 1,501.03 కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) ప్రతిపాదించిన మూడు కీలక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ అపెక్స్ కమిటీ (NAC) ఆమోదం తెలిపినట్లు విశాఖ ఎంపీ శ్రీభరత్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (UCF) పథకం కింద ఈ నిధులు విడుదల కానున్నాయి.
Visakhapatnam Infrastructure Funds|మధురవాడ జోన్‌లో ..
ఈ నిధులలో అత్యధికంగా రూ. 725.18 కోట్లను మధురవాడ జోన్‌లో అత్యాధునిక స్మార్ట్ తాగునీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు కోసం కేటాయించారు. అలాగే, అదే మధురవాడ జోన్ పరిధిలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను (అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్) సమగ్రంగా అభివృద్ధి చేయడానికి రూ. 658.61 కోట్లను, నగరవ్యాప్తంగా ఉన్న బల్క్ & సెమీ బల్క్ తాగునీటి సరఫరా లైన్లను ఆధునీకరించడం కోసం మరో రూ. 117.24 కోట్లను ఖర్చు చేయనున్నారు.
Visakhapatnam Infrastructure Funds|పెరగనున్న ప్రజల జీవన ప్రమాణాలు..
ఈ మూడు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు అందుబాటులోకి రావడం వల్ల విశాఖపట్నం నగర పౌర మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కావడమే కాకుండా, పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రజల జీవన ప్రమాణాలు, ఆరోగ్యం ఎంతో మెరుగుపడతాయని ఎంపీ శ్రీభరత్ ధీమా వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Oil Tankers in Hormuz | భారత్ సాహసం.. హార్ముజ్ జలసంధిలోకి చమురు నౌకలు!


