Pipeline Leakage Issue | పైప్​లైన్ లీకేజీలకు శాశ్వత పరిష్కారం చూపాలి : ఎమ్మెల్యే ధన్​పాల్​

shashi kiran Mottala

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Pipeline Leakage Issue | నగరంలోని మిర్చి కాంపౌండ్​కు వెళ్లే దారిలో మంచినీటి పైప్​లైన్ లీకేజీకి శాశ్వత పరిష్కారం చూపాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ (MLA dhanpal) అధికారులను ఆదేశించారు. నగరంలోని మార్వాడి గల్లీ, మిర్చి కాంపౌండ్​లలో మున్సిపల్ కమిషనర్(Nizamabad Municipal Commissioner) దిలీప్ కుమార్, పబ్లిక్ హెల్త్ డీఈ శ్రీకాంత్​తో కలిసి పరిశీలించారు.

Pipeline Leakage Issue | మూడురోజులుగా ఇబ్బందులు

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా మంచినీటి పైప్​లైన్ లీకేజీకి (pipeline leakage) గురైందని, దీంతో మురికి నీరు కలుషితమై నల్లాల్లోకి వస్తున్నాయన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు స్పందించకపోవడం తగదన్నారు. ఏళ్లుగా ఉన్న పాత లైన్​ను సర్వే చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. నూతన పైప్​లైన్ వేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. వీలైనంత తొందరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సంబంధిత అధికారులు సైతం కార్పొరేటర్లకు, ప్రజలకు జవాబుదారులుగా ఉండాలని సూచించారు. అలాగే మిర్చి కాంపౌండ్​లో చేతిపంపులకు మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

Pipeline Leakage Issue | గంజ్​ కమాన్​ వద్ద..

ప్రధానంగా గంజ్ కమాన్ వద్ద గత కొన్ని రోజులుగా నెలకొన్న డ్రెయినేజీ సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని ఎమ్మెల్యే అన్నారు. టెండర్లు పూర్తయినా పనులు ఎందుకు ప్రారంభించలేదని కమిషనర్​ను ప్రశ్నించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేస్తే బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. వచ్చే మూడు రోజుల్లో పనులు పూర్తి కావాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట స్థానిక కార్పొరేటర్ బంటు ప్రీతి ప్రవీణ్, కార్పొరేషన్ ఏఈ శ్రీకాంత్, సిబ్బంది ఉన్నారు.

waterrrr

ఇది కూడా చదవండి: YS Jagan Comments | కేటీఆర్​తో పొత్తుల గురించి మాట్లాడిన చంద్రబాబు.. జగన్​ సంచలన వ్యాఖ్యలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *