అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sapta Jyotirlinga Tour | ఐఆర్‌సీటీసీ (IRCTC) సప్త జ్యోతిర్లింగ్ దర్శన్ యాత్ర పేరుతో ఓ కొత్త టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. మధ్యప్రదేశ్‌లోని మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్ తో పాటు గుజరాత్‌లోని ద్వారక, సోమనాథ్, మహారాష్ట్రలోని పుణె, నాసిక్, ఛత్రపతి శంభాజీనగర్‌లోని జ్యోతిర్లింగాలను కవర్ చేస్తూ ఈ ప్యాకేజీ రూపొందించారు.
Sapta Jyotirlinga Tour | భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు
10 రాత్రులు, 11 పగళ్లు సాగే ఈ యాత్ర జూన్ 16న ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ స్టేషన్‌లలో ఈ రైలు ఎక్కవచ్చు.
Sapta Jyotirlinga Tour | ఈ ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకుందామా..
డే 1 : జూన్ 16న ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ నుంచి రైలు బయలుదేరుతుంది. కామారెడ్డి, నిజామాబాద్‌ల మీదుగా ఉజ్జయినికి ప్రయాణం సాగిస్తుంది.
డే 2 : జూన్ 17న ఉదయం 10 గంటలకు రైలు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. హోటల్ గదిలో బస ఉంటుంది. స్నానాదులు పూర్తయ్యాక మహాకాళేశ్వర ఆలయానికి తీసుకువెళతారు. రాత్రి ఉజ్జయినిలోనే బస ఉంటుంది.
డే 3 : జూన్ 18న ఉదయం అల్పాహారం అనంతరం రోడ్డు మార్గం ద్వారా ఓంకారేశ్వర్ ఆలయానికి చేరుకుంటారు. దర్శనం అనంతరం డాక్టర్ అంబేడ్కర్ నగర్ రైల్వేస్టేషన్‌కు చేరుకొని అక్కడినుంచి గుజరాత్‌లోని ద్వారకకు పయనమవుతారు.
డే 4 : జూన్ 19న సాయంత్రం 6.30 గంటలకు ద్వారక రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. హోటల్ గదిలో రాత్రి భోజనం, బస ఉంటాయి.
డే 5 : జూన్ 20న ఉదయం అల్పాహారం అనంతరం ద్వారకాదీశ్ ఆలయం సందర్శన ఉంటుంది. మధ్యాహ్న భోజనం తర్వాత బెట్ ద్వారక, నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయాన్ని దర్శనం, ఆ తర్వాత ఓఖా రైల్వేస్టేషన్‌కి చేరుకొని సోమనాథ్‌కు బయలుదేరతారు.
డే 6 : జూన్ 21న ఉదయం 6 గంటకు సోమనాథ్ రైల్వేస్టేషన్ కు రైలు చేరుకుంటుంది. అక్కడ కేటాయించిన హోటల్‌లో స్నానాదులు పూర్తి చేశాక సోమనాథ్ ఆలయానికి తీసుకువెళతారు. ఆ తర్వాత సోమనాథ్ రైల్వే స్టేషన్ నుంచి పుణెలోని ఖడ్కికి పయనమవుతారు.
డే 7 : జూన్ 22 న మధ్యాహ్నం ఒంటి గంటకు ఖడ్కి రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. హోటల్‌లో బస, రాత్రి భోజనం ఏర్పాటు చేస్తారు.
డే 8 : జూన్ 23న ఉదయం అల్పాహారం అనంతరం భీమశంకర ఆలయానికి తీసుకువెళతారు. ప్రస్తుతం ఈ ఆలయానికి మరమ్మతులు జరుగుతున్నాయి. అప్పటిలోగా మరమ్మతులు పూర్తికాకపోతే ప్రత్యామ్నాయంగా పుణెలోని మరిన్ని ఆలయాలను సందర్శించే అవకాశాన్ని ఐఆర్‌సీటీసీ కల్పించనుంది. అనంతరం ఖడ్కి రైల్వేస్టేషన్‌కి చేరుకొని నాసిక్ రోడ్‌కు పయనమవుతారు.
డే 9 : జూన్ 24న ఉదయం 6 గంటలకు నాసిక్ రోడ్ రైల్వేస్టేషన్ కు చేరుకుంటారు. అనంతరం త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయానికి తీసుకువెళతారు. దర్శనం పూర్తయ్యాక నాసిక్ రోడ్ రైల్వేస్టేషన్ కు చేరుకొని ఛత్రపతి శంభాజీనగర్‌కు పయనమవుతారు.
డే 10 : జూన్ 25న ఉదయం 5 గంటలకు ఛత్రపతి శంభాజీనగర్ రైల్వేస్టేషన్ కు చేరుకుని, హోటల్ లో స్నానాదులు పూర్తి చేసిన తర్వాత ఘృశ్నేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత ఛత్రపతి శంభాజీనగర్ రైల్వేస్టేషన్ నుంచి తిరుగు పయనమవుతారు.
డే 11 : జూన్ 26న ఉదయం 7 గంటలకు రైలు సికింద్రాబాద్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.
Sapta Jyotirlinga Tour | ప్యాకేజీ చార్జీలిలా..
ఎకానమీ (స్లీపర్ క్లాస్) : ఒక్కో టికెట్ ధర రూ. 17,600. ఐదేళ్ల నుంచి 11 ఏళ్ల మధ్య వయసువారికి రూ.16,300 చార్జీ చెల్లించాలి. ీVAటల్ లో బస చేసేందుకు నానఏసీ గదులు ఇస్తారు. ఒక్కో గదిలో నలుగురైదుగురు బస చేయాల్సి ఉంటుంది.
స్టాండర్డ్ (3ఏసీ) : టికెట్ ధర పెద్దలకు రూ. 26,700. ఐదేళ్ల నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ. 25,200. రాత్రిపూట బసకు ఏసీ గదులు కేటాయిస్తారు. ఒక్కో గదిలో ఇద్దరు లేదా ముగ్గురు ఉండాల్సి ఉంటుంది.
కంఫర్ట్ (2ఏసీ) : టికెట్ ధర రూ. 34,600. ఐదేళ్ల 11 ఏళ్ల మధ్య వయసువారికి రూ. 32,800. బస చేసేందుకు ఏసీ గదులు ఇస్తారు. ఇద్దరు లేదా ముగ్గురు గదిని షేర్ చేసుకోవాల్సి ఉంటుంది.
Sapta Jyotirlinga Tour | ప్యాకేజీలో ఏమేం ఉంటాయంటే..
ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అంతా రైల్వే సిబ్బందే చూసుకుంటారు.
ప్యాకేజీని బట్టి ప్రయాణానికి ఏసీ వాహనం సమకూరుస్తారు.
అవసరమైన సాయం కోసం ఐఆర్‌సీటీసీ టూర్ మేనేజర్లు అందుబాటులో ఉంటారు.
పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే మాత్రం యాత్రికులే చెల్లించాల్సి ఉంటుంది.
కేటాయించిన గదులకు ఏవైనా అదనపు సదుపాయాలు కావాలంటే ఆ చార్జీలను యాత్రికులే భరించాలి.
యాత్రికులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది.
పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ https://www.irctctourism.com ను సందర్శించండి.
ఇది కూడా చదవండి..: Milk Packet Colors | పాల ప్యాకెట్.. ఏ రంగులో ఏముందో?


