అక్షరటుడే,ఆర్మూర్: Armoor Municipal Meeting | ఆర్మూర్ మున్సిపల్ ఛైర్పర్సన్ గోనె లహరి (Gone Lahari) అధ్యక్షతన గురువారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అయితే కాంగ్రెస్ నుంచి 11 మంది కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది.
Armoor Municipal Meeting | రంగంలోకి దిగిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధి..
సొంత పార్టీ కౌన్సిలర్లే సమావేశానికి హాజరుకాకపోవడంతో వెంటనే ఓ కాంగ్రెస్ ప్రజాప్రతినిధి రంగంలోకి దిగారని సమాచారం. ప్రత్యేకంగా భేటీ అయిన 11 మంది కౌన్సిలర్లను ఆయన బుజ్జగించే ప్రయత్నం చేశారని తెలిసింది. అంతర్గతంగా ఏవైనా విభేదాలుంటే తర్వాత మాట్లాడుకుందామని ముందుగా సర్వసభ్య సమావేశానికి హాజరు కావాలలని కోరినట్లు సమాచారం. ప్రస్తుతం ఛైర్పర్సన్ వ్యవహరిస్తున్న తీరుపై 11 మంది కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ముందుగా సర్వసభ్య సమావేశానికి రావాలని.. తర్వాత మాట్లాడదామని చెప్పడంతో వారు సమావేశానికి హాజరయ్యారు. 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సర్వసభ్య సమావేశం గంట ఆలస్యంగా ప్రారంభమైంది.
ఇది కూడా చదవండి..: Kamareddy Farmers Protest | గంజాయి సాగుకు అనుమతివ్వండి.. సహనం కోల్పోయి డిమాండ్ చేసిన రైతులు..


