Kaleshwaram Pushkar Bus | కాళేశ్వరం పుష్కరాలకు వెళ్లేవారికి గుడ్​న్యూస్​.. నిజామాబాద్ నుంచి ప్రత్యేక బస్సు ఏర్పాటు

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Kaleshwaram Pushkar Bus | కాళేశ్వరం పుష్కరాల (kaleshwaram) సందర్భంగా టీజీఎస్​ ఆర్టీసీ (tgsrtc) ప్రత్యేక చర్యలు చేపట్టింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కాళేశ్వరానికి ప్రత్యేక బస్సును (tgsrtc special bus) ఏర్పాటు చేసింది. ఈ మేరకు గురువారం ఆర్​ఎం జ్యోత్స్న వివరాలు వెల్లడించారు.

Kaleshwaram Pushkar Bus | పన్నెండు రోజుల పాటు..

కాళేశ్వరం పుష్కరాలకు గురువారం నుంచి వచ్చే 12 రోజుల పాటు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక సర్వీసు నడపనున్నట్లు ఆర్​ఎం తెలిపారు. నిజామాబాద్ (Nizamabad) నుంచి ఉదయం 5 గంటలకు ప్రత్యేక బస్సు కాళేశ్వరానికి బయలు దేరుతుందన్నారు. టికెట్ ఛార్జ్ కేవలం రూ.380లుగా నిర్ణయించామని.. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. భక్తులు టీజీఎస్ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలన్నారు. సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉండేందుకు భక్తులు టీజీఎస్​ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని కోరారు.

ఇది కూడా చదవండి: Telangana Railway Projects| అశ్విని వైష్ణవ్‌తో కిషన్ రెడ్డి భేటీ.. రైల్వే పనులపై ప్రత్యేక సమీక్ష

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *