క్రీడలుIPL Tickets | ఉప్పల్​ స్టేడియం దగ్గర బ్లాక్​ టికెట్ల దందా

IPL Tickets | ఉప్పల్​ స్టేడియం దగ్గర బ్లాక్​ టికెట్ల దందా

ఉప్పల్​ స్టేడియంలో శుక్రవారం సన్​రైజర్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్​ జరగనుంది. ఈ మ్యాచ్​కు భారీగా క్రేజ్​ ఉండటంతో కొందరు టికెట్లను బ్లాక్​ మార్కెట్లో విక్రయిస్తున్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPL Tickets | ఐపీఎల్​ సీజన్​ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్స్​కు చేరుకోగా.. మరో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. దీంతో ప్రతి మ్యాచ్​ను ప్రేక్షకులు ఉత్కంఠగా చూస్తున్నారు. హైదరాబాద్​ (Hyderbad)లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్​లకు భారీగా అభిమానులు తరలివస్తున్నారు.

ఉప్పల్​ స్టేడియంలో శుక్రవారం రాత్రి సన్​రైజర్స్, ఆర్సీబీ (SRH vs RCB) మధ్య మ్యాచ్​ జరగనుంది. ఇప్పటికే ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్​కు చేరుకున్నాయి. ఈ మ్యాచ్​లో హైదరాబాద్ గెలిస్తే రెండో స్థానానికి, భారీ రన్​రేట్​తో గెలిస్తే మొదటి స్థానానికి చేరుకుంటుంది. ఈ మ్యాచ్​కు భారీగా క్రేజ్​ ఉండటంతో గతంలోనే ఎస్​ఆర్​హెచ్​ యాజమాన్యం టికెట్​ రేట్లను భారీగా పెంచింది. అయితే యాప్​లో టికెట్లు విడుదల చేసిన నిమిషాల్లోనే బుక్​ అయిపోయాయి. కొందరు టికెట్లను బుక్​ చేసుకొని బ్లాక్​ దందాకు తెరలేపారు.

IPL Tickets | రూ.వేయి టికెట్ రూ.10 వేలకు..

ఉప్పల్‌ స్టేడియం స్టేడియం దగ్గర జోరుగా బ్లాక్ టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. రేపు మ్యాచ్​ ఉండటంతో గురువారం నుంచే బ్లాక్​లో టికెట్లు విక్రయిస్తున్నారు. రూ.వేయి టికెట్​ను రూ.10 వేల నుంచి రూ..20 వేల వరకు అమ్ముతున్నారు. గేట్‌ నంబర్‌ 2 దగ్గర జోరుగా టికెట్ల దందా సాగుతోంది. రూ.10 వేల టికెట్‌ ఏకంగా రూ.లక్షకు పైగా అమ్ముతున్నట్లు సమాచారం. ఆన్​లైన్​లో టికెట్​ దొరకని అభిమానులు ఉప్పల్ స్టేడియం దగ్గరకు భారీగా చేరుకుంటున్నారు.

IPL Tickets | పోలీసుల ఫోకస్​

బ్లాక్‌ టికెట్లపై పోలీసుల స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. బ్లాక్​లో టికెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బ్లాక్‌లో టికెట్లు అమ్ముతున్న ముఠాపై 10 కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఈ సీజన్​లో హైదరాబాద్​లో జరుగుతున్న చివరి మ్యాచ్​ కావడంతో భారీగా క్రేజ్​ ఉంది. దీనిని ఆసరాగా చేసుకొని కేటుగాళ్లు ప్రేక్షకులను దోపిడీ చేస్తున్నారు.

దీనిని కూడా చదవండి : SRH Playoffs | క్లాసెన్ – ఇషాన్ కిషన్ కిల్లింగ్ షో.. చెన్నైకి షాక్, ప్లే ఆఫ్స్‌లోకి సన్‌రైజర్స్ హైదరాబాద్!

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

New Cars Burnt | కంటైనర్‌లో మంటలు.. 10 కొత్త కార్లు దగ్ధం

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : New Cars Burnt | కొత్త కార్లను...

TNGOs District Secretary | టీఎన్జీవోస్ జిల్లా సెక్రటరీగా కుంట శ్రీనివాస్

అక్షరటుడే, భీమ్‌గల్: TNGOs District Secretary | టీఎన్జీవోస్(Nizamabad TNGOs) జిల్లా...

Kamareddy Fast Track Court | బాలికపై లైంగిక దాడి.. నిందితుడికి 20 ఏళ్ల జైలు

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Fast Track Court | పెళ్లి చేసుకుంటానని...

AP Investment Projects|ఏపీలో ప్రాజెక్టుల స్పీడప్.. మంత్రుల కమిటీకి చంద్రబాబు కీలక ఆదేశాలు

అక్షరటుడే వెబ్‌డెస్క్:AP Investment Projects|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, కుదుర్చుకున్న...