అక్షరటుడే వెబ్‌డెస్క్:Kerala Assembly Speaker|కేరళ 16వ శాసనసభ స్పీకర్‌గా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ హోం మంత్రి తిరువంచూర్ రాధాకృష్ణన్ (Tiruvanchur Radhakrishnan) మే 22న బాధ్యతలు స్వీకరించారు. ఎన్నిక అనంతరం ముఖ్యమంత్రి వీడీ సతీశన్, ప్రతిపక్ష నేత పినరయి విజయన్‌లు ఆయన్ను గౌరవపూర్వకంగా స్పీకర్ కుర్చీ వద్దకు నడిపించారు. కొత్తగా ఎన్నికైన 140 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో తిరువనంతపురంలో ప్రారంభమైన అసెంబ్లీ తొలి సమావేశాల్లో భాగంగా ఈ ఎన్నిక జరిగింది.
Kerala Assembly Speaker|త్రిముఖ పోటీ ..
అధికార యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) తరఫున తిరువంచూర్ రాధాకృష్ణన్ అభ్యర్థిగా నిలవగా, ప్రతిపక్ష ఎల్‌డీఎఫ్ తరఫున సీనియర్ సీపీఐ(ఎం) నాయకుడు ఏసీ మొయిదీన్, ఎన్డీఏ కూటమి తరఫున చాతన్నూర్ ఎమ్మెల్యే బీబీ గోపకుమార్ పోటీ పడ్డారు. ఫలితాలను ప్రకటించిన ప్రొ టెం స్పీకర్ జి. సుధాకరన్, రాధాకృష్ణన్‌కు 101 ఓట్లు, ఏసీ మొయిదీన్‌కు 35 ఓట్లు, బీబీ గోపకుమార్‌కు 3 ఓట్లు వచ్చాయని, ప్రొ టెం స్పీకర్‌గా తాను ఓటు వేయలేదని తెలిపారు. అనంతరం సుధాకరన్ కొత్త స్పీకర్‌కు అభినందనలు తెలుపుతూ, తనకు సహకరించిన సభకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Kerala Assembly Speaker|నేతల ప్రశంసలు ..
ముఖ్యమంత్రి వీడీ సతీసన్ రాధాకృష్ణన్‌ను “ప్రియమైన అన్నయ్య” అని సంబోధిస్తూ, 1991 నుండి నిరంతరాయంగా (అడూర్, కొట్టాయం నియోజకవర్గాల నుండి) సేవలు అందిస్తున్న ఆయన ఒక ఆదర్శప్రాయమైన శాసనసభ్యుడని కొనియాడారు. ప్రతిపక్ష నేత పినరయి విజయన్ కూడా అభినందనలు తెలుపుతూ, అధికార, ప్రతిపక్ష బెంచీలలో , మంత్రిగా రాధాకృష్ణన్‌కు ఉన్న సుదీర్ఘ అనుభవం సభను అద్భుతంగా నడిపించడానికి తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, అసెంబ్లీలో ప్రజల భావాలను ప్రతిబింబించే ప్రతిపక్షాల హక్కులను కొత్త స్పీకర్ కాపాడతారని విజయన్ ఆకాంక్షించారు.
ఇది కూడా చదవడి: Delimitation Debate | డీలిమిటేషన్‌పై రాజకీయ వేడి.. చిదంబరం-లోకేష్ మధ్య మాటల యుద్ధం!


