Social Media Influencers | సోషల్ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్లకు ప్రశంసాపత్రాలు

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Social Media Influencers | ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు(Welfare Schemes) అర్హులకు చేరేలా సామాజిక మాధ్యమాల ద్వారా కృషి చేసిన సోషల్ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్లను జిల్లా యంత్రాంగం ప్రశంసించింది. ఈ మేరకు కలెక్టరేట్​లో (Nizamabad Collectorate) నిర్వహించిన కార్యక్రమంలో వారికి ప్రశంసాపత్రాలును అందజేసింది.

Social Media Influencers | ప్రజాపాలన..ప్రగతి ప్రణాళికలో భాగంగా..

ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్​రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) మాట్లాడుతూ..ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్డు భద్రతా చర్యల గురించి ఇన్​ఫ్లుయెన్సర్లు విశేషంగా కృషిచేశారన్నారు. వారి కృషిని గుర్తించి సత్కరించినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు భూపతి రెడ్డి, ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా(Mla Dhanpal), మేయర్ ఉమారాణి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ తదితరుల పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : Akunuri Murali Resignation | విద్యా కమిషన్​ ఛైర్మన్​ పదవికి ఆకునూరి మురళి రాజీనామా

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *