Schizophrenia Awareness | స్కిజోఫ్రినియాను మందులు, కౌన్సెలింగ్​తో నియంత్రించవచ్చు..: డాక్టర్​ విశాల్

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: ​ Schizophrenia Awareness | స్కిజోఫ్రినియాను మందులు, కౌన్సెలింగ్​తో నియంత్రించవచ్చని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్​ విశాల్ ఆకుల(Vishal Akula) అన్నారు. ఐఎంఏ(IMA Nizamabad) నిజామాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ప్రపంచ స్కిజోఫ్రినియా దినోత్సవం సందర్భంగా ఖలీల్‌వాడిలోని విశాల్ ఆల్కహాల్ డీ-అడిక్షన్ సెంటర్​లో (Vishal Alcohol De-addiction Center) స్కిజోఫ్రినియా వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

​ Schizophrenia Awareness | తీవ్రమైన మానసిక వ్యాధి..

డాక్టర్​ విశాల్ ఆకుల మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేస్తున్న తీవ్రమైన మానసిక వ్యాధులలో స్కిజోఫ్రినియా ఒకటని తెలిపారు. ఈ వ్యాధి వచ్చిన వారు వింతగా ప్రవర్తించడం, అతిగా కోపంగా ఉండడం, కారణం లేకుండా అనుమానించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం, తనలో తాను మాట్లాడుకోవడం లేదా నవ్వుకోవడం చేస్తారన్నారు. అలాగే చుట్టుపక్కల ఎవరూ లేకపోయినా ఎవరో తనతో మాట్లాడుతున్నట్లు లేదా కనిపిస్తున్నట్లు అనిపించడం, అర్థంలేని మాటలు మాట్లాడడం, తనపై ఎవరో మంత్రం లేదా చేతబడి చేశారని అనుమానిస్తారని తెలిపారు. జీవిత భాగస్వామిపై అనుమానం పెట్టుకోవడం వంటి లక్షణాలు స్కిజోఫ్రినియాలో కనిపించవచ్చని చెప్పారు.

​ Schizophrenia Awareness | అవగాహన లోపం కారణంగా..

సమాజంలో అవగాహన లోపం వల్ల ఇలాంటి లక్షణాలను చేతబడి, మంత్రం, దెయ్యం పట్టడం, బాణామతి వంటి పేర్లతో పొరపాటుగా భావిస్తున్నారని విశాల్​ అన్నారు. దీనివల్ల చాలామంది మాంత్రికులు, తాంత్రికుల వద్దకు వెళ్లి సమయం, డబ్బు వృథా చేసుకుంటున్నారని తెలిపారు. సరైన సమయంలో సైకియాట్రిస్ట్‌ను సంప్రదించి చికిత్స తీసుకుంటే స్కిజోఫ్రినియా నియంత్రణలోకి వస్తుందని, మందులు, కౌన్సెలింగ్ ద్వారా రోగులు సాధారణ జీవితం గడపగలరని పేర్కొన్నారు. ప్రతిఏడాది మే 24వ తేదీన ప్రపంచ స్కిజోఫ్రినియా దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు డా.విశాల్ ఆకుల, ప్రధాన కార్యదర్శి హరీష్ స్వామి, జీవన్ రావు, రాజేందర్ సూరినీడు, రాజశేఖర్, మోహన్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు శ్యామ్ అగర్వాల్, ఆస్పత్రి సిబ్బంది, పేషెంట్లు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: TGPOLYCET Results 2026 | రేపు పాలిసెట్​ ఫలితాల విడుదల

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *