Highway Robbery gang Arrest | దారి దోపిడీలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Highway Robbery gang Arrest | పట్టణంలో దారి దోపిడీకి (Robbery Case) పాల్పడిన నిందితులను కామారెడ్డి పోలీసులు (Kamareddy Police) అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం కామారెడ్డి పట్టణ సీఐ నరహరి (CI narahari) మీడియాకు వివరాలు వెల్లడించారు.

Highway Robbery gang Arrest | రాజీవ్​ నగర్​ కాలనీ సమీపంలో..

ఈనెల 18న రాత్రి 8 గంటలకు రాజీవ్ నగర్ కాలనీ, రేణుక ఫంక్షన్ హాల్ ఎదురుగా ఖాళీ స్థలంలో లింగంపేట్ మండలం మోతే గ్రామానికి చెందిన గుండ్రెడ్డి రాజు రెడ్డి, అతని బంధువు రంజిత్‌పై ఐదుగురు వ్యక్తులు దాడి చేసి బెదిరించారు. రాజు వద్ద నుండి రూ.4 వేల నగదు, ఆధార్ కార్డు, రంజిత్ వద్ద ఉన్న రూ.300 దుబాయ్ దిరమ్స్ దోచుకున్నారు. రాజు మొబైల్ నుండి బలవంతంగా రూ.వెయ్యి యూపీఐ(UPI) ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. దాంతో అదేరోజు అర్ధరాత్రి 12:30 గంటలకు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ పుటేజీలు, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు.

ఈ నెల 21న డీలక్స్ బేకరీ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న షేక్ సల్మాన్, మహ్మద్ మొయిజ్, బొందీ లోకేష్, షేక్ షానవాజ్, ఓ మైనర్​ను అదుపులోకి తీసుకున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలని రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్లే వారిని టార్గెట్ చేసి దోపిడీలు చేస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. నిందితుల నుండి రూ.8,300 నగదు, రూ.300 దుబాయ్ దిరమ్స్, రెండు మొబైల్స్, బాధితుడి ఆధార్ కార్డు, పర్స్, హోండా యాక్టివా స్కూటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించగా, బాల నేరస్తుడిని జువెనైల్ కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు.

ఇది కూడా చదవండి: NEET Paper Leak Arrest | నీట్​ పేపర్​ లీకేజీ కేసులో మరొకరి అరెస్ట్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *