నిజామాబాద్Mopal Police Arrest | ఉద్యోగులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న నిందితుడి అరెస్టు

Mopal Police Arrest | ఉద్యోగులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న నిందితుడి అరెస్టు

జీపీ కార్యదర్శి విధులు నిర్వహిస్తున్న సమయంలో నిందితుడు బెదిరించి రూ.10,000/- డిమాండ్ చేసినట్లు వెలుగులోకి వచ్చింది.

అక్షరటుడే, డిచ్​పల్లి(మోపాల్): Mopal Police Arrest | నిజామాబాద్​ జిల్లా మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రామపంచాయతీ సర్పంచులు, జీపీ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని మోపాల్​ పోలీసులు అరెస్టు చేశారు.

Mopal Police Arrest | అట్రాసిటీ కేసులు పెట్టిస్తానని..

కేసు వివరాల ప్రకారం, ప్రాజెక్ట్ రామడుగు గ్రామానికి చెందిన జంగం బస్వరాజ్ తనను “మన దునియా” పత్రిక రిపోర్టర్‌గా పరిచయం చేసుకొని, గ్రామపంచాయతీ కార్యాలయాలకు తరచుగా వెళ్లి సర్పంచులు, జీపీ సిబ్బంది, ఇతరులను బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేసేవాడు.
డబ్బులు ఇవ్వకపోతే తప్పుడు వార్తలు ప్రచురిస్తానని, ACB కేసుల్లో ఇరికిస్తానని, ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తానని, ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయిస్తానని, SC/ST అట్రాసిటీ కేసులు పెట్టిస్తానని బెదిరించి పలుమార్లు ఫోన్‌పే ద్వారా, నగదు రూపంలో డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైంది.

Mopal Police Arrest | మొబైల్ లొకేషన్ ఆధారంగా

ఠాణాకుర్దు గ్రామ సర్పంచి ఫిర్యాదు మేరకు మోపాల్​ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.. అయినా కూడా, జీపీ కార్యదర్శి విధులు నిర్వహిస్తున్న సమయంలో నిందితుడు బెదిరించి రూ.10,000/- డిమాండ్ చేసినట్లు వెలుగులోకి వచ్చింది.
నిందితుడి మొబైల్ లొకేషన్ ఆధారంగా శుక్రవారం (మే 22) అదుపులోకి తీసుకొని నిందితుడి వద్ద నుంచి ఫోన్‌పే లావాదేవీలకు ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో నిందితుడు ఇతర గ్రామాల సర్పంచులను కూడా ఇదే విధంగా బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు ఒప్పుకొన్నాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Jukkal MLA Comments | పోలీస్ vs ప్రజాప్రతినిధులు! అధికార పక్షంలో నివురుగప్పిన నిప్పులా ‘మాఫియా’ వివాదం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Jukkal MLA Comments | తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు...

SRH vs RCB | IPL 2026: హైదరాబాద్ భారీ లక్ష్యం.. పవర్‌ప్లేలోనే ఆర్సీబీ కీలక వికెట్లు డౌన్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH vs RCB | రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో...

NIMS Kidney Transplants | కిడ్నీ ట్రాన్స్​ప్లాంట్స్​లో నిమ్స్​ అరుదైన రికార్డు.. 2K మైలురాయి పూర్తి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: NIMS Kidney Transplants | కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్స్...