CM Yadagirigutta Visit | యాదగిరిగుట్టలో సీఎం పర్యటన.. వేద పాఠశాలకు శంకుస్థాపన

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Yadagirigutta Visit | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) శనివారం దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

యాదగిరిగుట్ట (Yadagirigutta)లో వేద పాఠశాల నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‎లో యాదగిరి గుట్టకు చేరుకున్న ముఖ్యమంత్రికి అధికారులు, ఆలయ పూజారులు స్వాగతం పలికారు. అనంతరం గుట్టకు చేరుకున్న సీఎం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కంచి కామకోటీ పీఠాధిపతి శంకర వియేంద్ర సరస్వతి ఆశీర్వాదం తీసుకున్నారు.

CM Yadagirigutta Visit | 15 ఎకరాల్లో వేద పాఠశాల

ఆలయ అభివృద్ధిలో భాగంగా రూ.43 కోట్లతో 15 ఎకరాల్లో నిర్మించనున్న వేద పాఠశాలకు సీఎం భూమిపూజ చేశారు. కొండపైన కల్యాణ మండపం, మెట్ల మార్గంలో పైకప్పు ఏర్పాటు, వాయువ్య దిశ ద్వారా ప్రధానాలయ ప్రాంగణానికి చేరుకోవడానికి ప్రత్యేక మెట్ల మార్గం నిర్మాణాలకు శంకర విజయేంద్ర సరస్వతి స్వామితో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. రూ.100 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నారు. వేద విద్యను మరింతగా విస్తరించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. ఇందులో భాగంగానే వేద పాఠశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

CM Yadagirigutta Visit | అధికారుల సమన్వయ లోపం

సీఎం పర్యటనలో అధికారుల మధ్య సమన్వయ లోపం బయట పడింది. సీఎం చాపర్‌ ల్యాండ్‌ అయ్యాక కూడా జిల్లా యంత్రాంగం కనిపించలేదు. దీంతో 15 నిమిషాలు ఆయన హెలికాప్టర్​లోనే వేచి ఉన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి (Komatireddy Venkat Reddy), కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Cabinet Expansion | కేంద్ర మంత్రి పదవి దక్కేదెవరికి..? పొలిటికల్ సర్కిల్ లో జోరుగా చర్చ!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *