BondBazar CEO | బాండ్‌బజార్ నూతన సీఈఓగా ఎస్‌. శంభత్‌ కుమార్‌ నియామకం..

భారత్‌కు చెందిన ప్రముఖ సాంకేతిక ఆధారిత ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ పెట్టుబడుల వేదిక అయిన 'బాండ్‌బజార్' (BondBazar).. తమ సంస్థ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) గా ఎస్‌. శంభత్‌ కుమార్‌ను నియమించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: BondBazar CEO | భారత్‌కు చెందిన ప్రముఖ సాంకేతిక ఆధారిత ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ పెట్టుబడుల వేదిక అయిన ‘బాండ్‌బజార్’ (BondBazar).. తమ సంస్థ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) గా ఎస్‌. శంభత్‌ కుమార్‌ను నియమించింది. సంస్థను తదుపరి దశ వృద్ధిలోకి తీసుకెళ్లే బాధ్యతను ఆయన చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా రిటైల్ మదుపరులకు ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ పెట్టుబడులను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడం, డిజిటల్ పెట్టుబడుల వ్యవస్థను బలోపేతం చేయడం , పంపిణీ నెట్‌వర్క్‌ను విస్తరించడంపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు.

BondBazar CEO | సుదీర్ఘ అనుభవం..

ఎస్‌. శంభత్‌ కుమార్‌కు ఆర్థిక సేవలు, వ్యాపార అభివృద్ధి, ఉత్పత్తుల వ్యూహరచన , పంపిణీ రంగాల్లో దాదాపు 25 ఏళ్లకు పైగా అపారమైన అనుభవం ఉంది. బాండ్‌బజార్‌లో చేరడానికి ముందు ఆయన ‘హెచ్‌డీఎఫ్‌సీ ( HDFC ) సెక్యూరిటీస్’ లో చీఫ్ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అంతకుముందు ‘రిలయన్స్ క్యాపిటల్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్’ లో సెగ్మెంట్ హెడ్-బిజినెస్ డెవలప్‌మెంట్‌గా పని చేయడంతో పాటు, ‘స్పార్క్‌ క్యాపిటల్’ తోనూ ఆయనకు మంచి అనుబంధం ఉంది.

BondBazar CEO | అపారమైన అవకాశాలు..

తన నియామకంపై ఎస్‌. శంభత్‌ కుమార్‌ స్పందిస్తూ.. “కీలకమైన వృద్ధి దశలో ఉన్న బాండ్‌బజార్‌లో చేరడం చాలా ఆనందంగా ఉంది. భారత్‌లో ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ మార్కెట్లలో రిటైల్ మదుపరుల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు అపారమైన అవకాశాలున్నాయి. ఈ లక్ష్యాలను సాధించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు మరింత సులభమైన, పారదర్శకమైన , విశ్వసనీయమైన పెట్టుబడి అనుభవాన్ని అందించేలా మా సేవలను విస్తరిస్తాము” అని తెలిపారు.

ఇది కూడా చదవండి: Hyderabad Water Supply | తాగునీటి కొరత రాకుండా జలమండలి చర్యలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *