Chinnur house theft | తాళం వేసిన ఇంట్లో దొంగల బీభత్సం.. బంగారు ఆభరణాలు అపహరణ!

ఇంటి లోపల దొంగలు కారం పొడి చల్లి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసు జాగిలాలకు తమ వాసన దొరక్కుండా ఉండేందుకే దుండగులు ఇలా కారం పొడి చల్లి ఉంటారని అనుమానిస్తున్నారు.

Naresh Chandan

అక్షర టుడే, ఎల్లారెడ్డి : Chinnur house theft | కామారెడ్డి Kamareddy జిల్లా నాగిరెడ్డిపేట మండలం చినూర్ గ్రామంలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన గుర్తుతెలియని దుండగులు, ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి ఇంట్లోని బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు.

Chinnur house theft | అసలేం జరిగిందంటే..

చినూర్ గ్రామానికి చెందిన కొండ ప్రమేల (45) తన తల్లితో కలిసి నివాసముంటున్నారు. ఈ నెల 17వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో ఇంటికి తాళం వేసి, బంధువుల ఇంటికి మెదక్ వెళ్లారు. తిరిగి గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటికి వచ్చి చూడగా, ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

Chinnur house theft | 21 గ్రాముల బంగారం చోరీ

ఇంట్లోకి వెళ్లి బీరువాను పరిశీలించగా, వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలో భద్రపరిచిన 5 గ్రాముల బంగారు ఉంగరం, 3 గ్రాముల బంగారు చెవి రింగులు, 13 గ్రాముల బంగారు గుండ్లు (మొత్తం 21 గ్రాముల బంగారం) చోరీకి గురైనట్లు బాధితురాలు గుర్తించారు. అయితే, బీరువాలో ఉన్న మరో 10 గ్రాముల బంగారు గుండ్లు, 20 తులాల వెండి గొలుసుల జోలికి మాత్రం దొంగలు వెళ్లకపోవడం గమనార్హం.

Chinnur house theft | కారం పొడి చల్లి.. ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తలు

చోరీ జరిగిన ఇంటి ప్రధాన ద్వారం వద్ద, అలాగే ఇంటి లోపల దొంగలు కారం పొడి చల్లి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసు జాగిలాలకు తమ వాసన దొరక్కుండా ఉండేందుకే దుండగులు ఇలా కారం పొడి చల్లి ఉంటారని అనుమానిస్తున్నారు.

Chinnur house theft | రంగంలోకి ఫింగర్ ప్రింట్ బృందం..

బాధితురాలి ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫింగర్ ప్రింట్ (వేలిముద్రల) బృందాన్ని రప్పించి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఒక కీలకమైన ఛాన్స్ ప్రింట్‌ను అధికారులు సేకరించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఎస్సై భార్గవ్ తెలిపారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *