Goud Community Building | గౌడ సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు

గౌడ సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు మంజూరు చేసింది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Goud Community Building | గౌడ సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీంతో గౌడ సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

Goud Community Building | పీసీసీ చీఫ్​కు ఘన సన్మానం..

ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ (Mahesh Kumar Goud)ను గౌడ సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఘనంగా సన్మానించారు. గౌడ సంఘం ఆత్మగౌరవానికి, ఐక్యతకు ప్రతీకగా నిలిచేలా భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ భవనం గౌడ సామాజిక వర్గ అభ్యున్నతికి, సంఘటిత శక్తికి చిరస్థాయిగా నిలిచే కేంద్రంగా రూపుదిద్దుకోనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ ఛైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, వైస్ ఛైర్మన్ నాగరాజు గౌడ్, పీపీ దయాకర్ గౌడ్, జనరల్ సెక్రటరీలు సత్యం గౌడ్, రామారావు గౌడ్, చక్రవర్తి గౌడ్, రామన్ గౌడ్, శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Diwali Fire Safety | పటాకుల మోతలో భద్రత మరవొద్దు..!. జాగ్రత్తలు పాటిస్తే దీపావళి సంబురమే..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *